పుట:Kasiyatracharitr020670mbp.pdf/258

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ప్రకారమున్ను చచ్చొకము సుమారు యిరువైకొట్లమయిలు లున్నవి. వీటిలో ఉదకమయముగా నుండే భూమి 13 కోట్లు మయిళ్ళు పోగా మనుష్య వాసముగా నుండే భూమి నాలుగు కోట్ల మయిళ్ళు. యిందులో వశింఛే మనుష్యమండలి డెబ్బదికోట్లు. యిందులో దక్షిణోత్తరాలలో కన్యాకుమరి మొదలు కాశ్మీరము వవకున్ను తూర్పు పడమరలలో సింధునది మొదలు బ్రహ్మపుత్రి నదివరకున్ను వాసము చెసే హిందు దేశల్పు జనులను మొత్తముగా చెరిసగముగా లెక్కచూచినా ముప్పదియైదు కోట్లకు యెక్కువవుండరు. వర్ణాశమ నియమము కలిగిన కర్మభూమి పయిన వ్రాశిన యల్ల సరిహద్దుకు లోపల నున్నది గాని యీ బ్రఖాండములో మరియెక్కడనున్ను లేదు.

పైన వ్రాసిన చత్రురశ్ర,మ భూమిలో నుండే మానిషమండలికి మాత్రమే వర్ణాశ్రమ ధర్మములు కలిగియున్నవి గాని మిగిలిన సగం భూమిలోనున్ను వారికి వృత్తులచేతనున్ను కృత్యములఛేతనున్ను మనుష్యతారతమ్య జ్ఞానమేగాని వృత్తికృత్యములతోకూడా హిందూదేశ మర్యాద ప్రకారము రక్త పరంపర నిమిత్తము లేదు. యీ కర్మభూమిలోనున్ను రక్త పరంపరే స్వతంత్రముగా వర్ణాశ్రమాలను కాపాడనేరదు. కృత్యమున్ను వృత్తిన్ని పుట్టుకతొకూడా మిళిగమై యుండవలసి యున్నది గదా! యిందుకు ఆకరమేమంటే "జన్మనా జాయతే శూద్ర: కర్మణా యాయతే ద్విజ:" అనే వచనమే ఆకరము. యీశ్వరుడు ఆదిలో యీ వర్ణాశ్రమ ధర్మములతో మనుష్య సృష్టిని చేసి యుంటే బ్రహ్మాండమందంతటా యీవర్ణాశ్రమ ధర్మములు యీ రీతిగానే గలిగియుండ వచ్చునే! అయితే ఈ బ్రహ్మాండములలో మానుష సృష్టి పయినవ్రాసిన చతురశ్రమమైన కర్మభూమి మొదలుగా ఆరంభింపబడినది. అందుకు అకర మేమంటే యింగిలీషు వారి బైబిలులో యేడం (Adam)అనే కూటస్థురాలున్ను యీ ప్రదేశములో పుట్టినట్టు చెప్పియున్నది గనుకనున్ను మన పురాణాలు అందుకు ఏకవాక్యతపడుతున్నవి గనుకనున్ను మన పురాణాలు అందుకు ఏకవాక్యతపడుతున్నవి గనుకన్ను మానుష సృష్టికి ఆరంభము మొట్టమొదట హిందుదేశములో నుంఛేనని నిశ్చయించ వలసినది. పిమ్మట పరంపరగా