పుట:Kasiyatracharitr020670mbp.pdf/257

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


శాపము తగిలి భూలోకములో మానుషజన్మము కలిగి ఉభయులున్ను దాంపత్యము పొసగి సంతు కలిగినట్టున్ను వారికి కలిగిన సంతు విశ్వకర్మ కల్పిత బ్రాహ్మణులని వారి శిల్పిపనులు చేస్తూ యిప్పటికిన్ని నెగడి వున్నారు.

గయలో వుండే డాక్టరు జాన్ డేవిడు సన్ దొర ప్రపంచసృష్టి సంబంధము లయిన మాటలు నాతో ఆడుతూవుండగా హిందూదేశములో వుండే బ్రహ్మక్షత్రియ వైశ్య శూద్ర వర్ణాలనె భేదము యీశ్వ నిర్ణయమా? లేక్ మానుష సంకేతమా? అని ప్రశ్నవేసినాడు. బహుదూరము వాదము జరిగి మానుష నిర్ణయమని తెలియచేసినాను. పిమ్మటనున్ను బహుశా విచారించగా అదే తాత్పర్యమునాకు బోధ అయినది. అందుకు హేతువులు యేమంటే వొక పురుషుడు ప్రజల వుత్పత్యర్ధమున్నూ తద్వారా మానుషానందానుభవార్ధమున్ను స్త్రీని పరిగ్రంచి ప్రజావృద్ధి చేసినట్టు యీశ్వరుడు సృష్టించిన అనేక బ్రహ్మండాలలో అనేకకోటి పిండాండాలు అంతర్భూతములై వున్నవి. ప్రతిపిండాండానికిన్ని బ్రహ్మాండానికికలిగిన సకలగుణాలు చేష్టలు మొదలయినవి వేర్పడివున్నవి. అందుకు దృష్టాంత మేమంటే పృధివ్యప్తేజోవాయ్వాకాశాలు ప్రతి బ్రహ్మాండానికికలిగివున్నట్టు అంతర్భూతములుగా వుండే అనేక పిండాండాలకు కలిగివున్నవి. ప్రతి పిండాండానికిన్ని అనేక సూక్ష్మ పిండాండాలు అంతర్భూతములై వున్నవి. అందుకు దృష్టాంతమేమంటే ప్రతి దేహములోనున్ను అనేక క్రిమికీటాదులు ఉత్పత్తి అయి నశింపుచు వుండడము సిద్ధము గనుక యీఅర్ధమున్ను సత్యమే గదా! ఒక అద్దానికి యెదురుగా మరివొక నిలువుటద్దము కట్టి నడమ మనిషి నిలిచి చూస్తే వొకటిలో నొకటిగా తన ప్రతి బింబాలు అసంఖ్యేయముగా ఉత్పత్తి అయ్యేటట్టు దీపదీపికా న్యాయముగా అనేక అనుష్యులున్ను జంతువులున్ను పరంపరగా యీశ్వర భాతిచేత సృష్టములై స్థితిని బొంది లయమవుచు నున్నవి.

ఇట్లు సృజింపబడిన యనేక బ్రహ్మాండములలో మనము వసించే బ్రహ్మాండము న్నొక్కటే. యిందులో యీ భూమియొక్క కొలత యింగిలీషు వారి యొక్క వూహ ప్రకారమున్ను మన గోళశాస్త్ర