పుట:Kasiyatracharitr020670mbp.pdf/24

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


10

ఏనుగుల వీరాస్వామయ్యగారు బ్రొను గారికి వ్రాసిన లేఖ.

ఈ పుస్తకం ప్రకటించడంలో దీనివల్ల నేను లాభము పొందదలచడంలేదని మనవి చేస్తున్నాను దీని ప్రతులను అమ్మడంవల్ల వచ్చే లాభాన్ని ఇచ్చివేయడానికి నాకు యేలాంటి అభ్యంతరమున్నూ లేదు. నష్టమేమైనావస్తే నేనే భరింపగలను. నష్టము రాదనే నా దృడనిశ్వాసము.

నేను మచిలీపట్టణముననున్న కాలంలో తాము నాయెడల చూపిన దయకు నా కృతజ్ఞతాభివందనాలు స్వీకరింపగోరుతాను. ఈయూరినుంచి తమకేమికావలిసినా నాకు తెలిపితే నేను ఆపనిని జాగ్రత్తగా చేస్తాను.

ఇలాగ చనువు తీసికొన్నందులకు క్షమింపవేడుతూ తమ యారోగ్యము కొరకు సౌఖ్యముకొరకు పరమేశ్వదుని ప్రార్ధిస్తూ అతిగౌరవ పురస్సంగా మీముందు తమవిధేయుడు. భృత్యుడు.

(Y) యే. వీరాస్వామి అని ఇంగ్లీషుసంతకం వున్నది.

తాజాకలం.

ప్రస్తుతం స్టోనుహౌసు దొరగారివద్ద వున్న నాతమ్ముణ్ణిగురించి నేను తమల్ని వేడుకున్న విషయం తమకు వినయముతో జ్ఞాపకం చేస్తున్నాను.

(Y) యే. వీరాస్వామి అని ఇంగ్లీషుసంతకం వున్నది.

ఈ జాబుపైన సి.పి.బ్రౌనుగారి నోటు:

'ఆపుస్తకాన్నిప్రకటించడానికి ఇంకా సిద్దంగా లేమనిన్నీ ఆపుస్తకమును పంపితే చూస్తాననిన్నీ స్కాందమును ఈకింది బభాగాలను తెనిగించేపని ప్రస్తుతము నిలుపుతున్నాననిన్నీ, సూతసంహిత నావద్ద వున్నదనిన్నీ తెలుపుతూ 1832 జనవరి 25 వ తేదిన జవాబువ్రాయడమైనదీ అని యున్నది.


ఈ కాశీయాత్ర వ్రాత ప్రది 455 పుటలో, మచిలీబందరును గూర్చి వ్రాస్తూ "నాతమ్ముడయిన సీతాపతికి బారుజల్లీ అనే తాలూకాకు పని అయిందన్నీనాకోసరం బందరులో శలవుమీద కాచివున్నాడు" అని వీరాస్వామయ్య గారు వ్రాశారు. బహుశ: పైఉత్తరంలో ఉదాహరించిన 'తమ్ముడు ' అతడే అయి యుండవచ్చును.