పుట:Kasiyatracharitr020670mbp.pdf/227

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


బంగాళీ బ్రాహ్మణులు బహుమంది యిక్కడ పండితులయి యున్నారు. వారు ఉత్కలగౌడులు. ఉత్కలదేశములో మత్స్యభక్షణ, ద్రావిడ దేశములో మాతులకన్యా వివాహము, మాగధదేశములో మద్యపానము, మైధిలదేశములో దేవరేణ సుతోత్పత్తిన్ని, అద్యాపి నిషిద్ధము కాదని ప్రసిద్ధము.

ఈ గంగాపుత్రుల ఉత్పత్తి హేయముగా కొన్ని పురాణాదులలో చెప్పియున్నది. వారు చెప్పడ మేమంటే భీష్మాచార్యులకు పూర్వము గంగ కన్నకొడుకులను తనలో ఐక్యము చేసుకొని యుండగా అటుతర్వాత భీష్మాచార్యుల తండ్రిని గంగ వదలిన వెనక, లోగడ తనలో కలుపుకొన్న పుత్రులను మళ్ళీ భూమిలో ఉద్ధరించినట్టున్ను, తాము వారి వంశస్థులనిన్ని వాదింపుచున్నారు. వారు ఇప్పట్లో కాన్యకుబ్జులతో సంబందములు చేయుచున్నారు. గంగాతీరమునందు ఏదానమున్ను వారిని మినహా మరి ఒకరికిన్ని యివ్వకూడదు. ఠాణీబ్రాహ్మణులు వచ్చినవారికి తీర్ధ పురోహితము చేసినా యిండ్లలో యిచ్చే దాన్ని ప్రతిగ్రహించ తగ్గవారేగాని బాహటముగా గంగాతీరమునందు తీసుకోలేరు. ఘాటియాలకు ఠాణీలకు గంగాపుత్రులు తమ రహితులని అధికారమును ఆ యా కాలములలో చెల్లింపుచు వచ్చుచున్నారు.

ఇక్కడి రూపాయిలకు చెన్నపట్టణపు రూపాయలకున్ను ఒక అణా భేదమున్నది. మన రూపాయలు చిన్న. రూపాయి 1 కి 16 గండులనే 64 పయిసాలు. అన్ని భక్షణయోగ్య పదార్ధాలున్ను నయముగా అమ్మినా రుచికలిగీ యుండడములేదు. చూపుకుమాత్రము బహుబాగా యుంచున్నవి. నీళ్ళున్ను ఉప్పున్నూ కలియని మిఠాయిన్ని పక్వాన్నాలున్ను సకలమయిన బ్రాహ్మణులున్ను కొని భక్షింపుచున్నారు. చేసే వారిజాతి విచారణ అక్కరలేదు. పుష్పాలలో జాజి పూలుతప్ప యితర సుగంధ పుష్పాలు దొరకవు. మన దేశములో తురక పూలని నిషేధముగా యెంచేపుష్పము లంతా యిక్కడ దేవతారాధనకు పరిగ్రహింపుచు నున్నారు. యిక్కడి గుళ్ళలో మహా