పుట:Kasiyatracharitr020670mbp.pdf/221

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్తూపీలు సుమారు యేనూరు అడుగుల పొడుగు వుండవచ్చును. తొలుకాలమందు అకబరు పాదుషా కాశీ యావత్తూ తురకాణ్యము చెయ్యవలె నని తలచి ముఖ్య మయిన గుళ్ళు యావత్తు కొట్టి పాడుచేసినప్పుడు యీ మసీదును కట్టినాడట *అద్యాది అది నిర్మించబడి యుండే శృంగారము యింగిలీషువారిని కూడా మరామత్తు చేశేటట్టు ప్రేరేపణ చేసినది. యిప్పుడు వుండే విశ్వేశ్వరుడి ఆలయము మొదలుగా అనేకములు నూతన నిర్మాణములై వున్నవి.

పయి శ్లోకములో నుండే గంగా అనే తీర్ధము ఒక కొలను స్వరూపముగా పట్టణమునకు పశ్చిమ భాగమందు యుండి యున్నది. కాశీ దేవి అనే త్రిలోచనేశ్వరుడి ఆలయము వద్ద దుర్గాఘట్టములో యున్నది. గుహా అనే ఒక బిలము కాశీ పట్టణమునకు దక్షిణభాగమందున్నది. యీ కాశీ ఖండములో విష్ణుసాదిగా త్రిమూర్తులులేమి యింద్రుడాదిగా దేవతలేమి ధృవుడాదిగా తేజస్వరూపాలేమి సూర్యుడాదిగా గ్రహాలేమి అగస్త్య్లుడాదిగా ఋషులేమి ఈ అవిముక్త క్షెత్రమందున్న ఆనందవనములో లింగప్రతిష్ట చేసి ఆరాధన తపస్సు పురస్సరముగా ఆ యా విభూతులను సంపాదించుకొన్నట్టు యున్నది. గనుక ప్రతిలింగానికి అగస్త్యేశ్వరుడని, రామేశ్వరు డని ఒక్కొక్క పేరుగలిగి అవి వొకానొక దినమున అక్కడి ఆరాధన ప్రాబల్యము కలగచేసుకొని ఉండియున్నది. ఆ యా నియమింప బడిన దినములలో ఆ యా స్థలాలలో జనసంఘము మిక్కటముగా నుంచున్నది.

ఇక్కడ నుండే ఆలయాలు అన్ని సంకుచితములుగా నున్ను అరిటిపువ్వందముగా సాదాస్తూపీలు కలిగి అర్చకులపట్ల నిండా కాపులేకుండా నున్ను వృషభముల చేత ఆవరింపబడిన్ని యుంచున్నవి. ఆరాధనచేశేవారు పత్రపుష్పఫలతోయములతో తామే, శక్తి కలిగి నంతమట్టుకు ఆయా ఆలయములలో మూర్తులను జాతినియమము లేకుండా ఆరాధనచేయుచు వచ్చుచున్నారు. కాచియుండే


  • ఇది పొరబాటు ఈ మశీదుకట్టినది జౌరంగజేబు చక్రవర్తి. విశ్వేశ్వరాలయం క్రీ. శ. 1669 ఏప్రిలులో నాశనం చేయబడింది.