పుట:Kasiyatracharitr020670mbp.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8

History of the Presidency College Madras (Centenary) 1940. The Madras Tercentenary Commemoration Volume The Histoiy of Madras- Prof C, S, Srinivaaachari Vestings of old Madras-- H. D. Love Life of Gazola Lakshminarsu Chetty Qaru, - Representative men of Southern India by G, paramehwaram Pillai(1896} .The Journal of Vennelacunty Soobrow, Native of Ongole Foster Press, Madras. 1873

శ్రీ ఒంగోలు వేంకటరంగయ్యపంతులు గారు వ్రాసిన 'నెల్లూరులోని కొందఱుగొప్పవారూ--వెన్నెలకంటి సుబ్బారావు పంతులుగారూనేచిన్నపుస్తకం. 1941 సం|| మార్చి 1వ తేది మొదలు కృష్ణాపత్రికలో 11 సంచికలలో ప్రకటింపబడిన "ఇంగ్లీషు చదువులు" అనే శీర్షికతో నేను వ్రాసిన బ్యాసాలు. ఆంధ్రపత్రిక వృషభసంవత్సరాది సంచికలో 'చెన్నపట్టణము దాని పూర్వ చరిత్రా అనే శీర్షికతో నేను వ్రాసిన పెద్ద వ్యాసము. ఆంధ్ర వార పత్రికలో 1941 సం|| మార్చి 26 వ తేదీమొదలు 5 సంచికలలో నేను వ్రాసిన "బిషప్ హెబర్ గారి భారతదేశయాత్ర" అనేవ్యాసాలు. ఆపత్రికలో 1941 సం|| ఫిబ్రవరి 5 వ తేదీన కాశీయాత్ర చరిత్రగురించిన్నీ జూలై 30 వ తేదీన శ్రీ ఏనుగుల వీరాస్వామయ్యగారిని గురించిన్నీ నేను వ్రాసిని వ్యాసాలు.

సి.పి. బ్రొన్ దొరగారికి వీరాస్వామయ్యగరు వ్రాసిన లేఖ

[శ్రీ వీరాస్వామయ్యగారి దస్తూరితో ఇంగ్లీషులోవున్న అసలు ఉత్తరం, చెన్నపట్టణమున ఓరియంటల్ మాన్యూస్క్రిట్సు లైబ్రరీలోవున్న కాశీయాత్ర చరిత్ర వ్రాతప్రతిచివర అతికించి యున్నది. దానికిది తేలుగు. ఉత్తరపైన బ్రౌనుగారి దస్తూరితో రెమార్కు వున్నది. ఉత్తరం పైన "సి.పి. బ్రౌన్ ఎక్త్వర్, మచిలీపట్టణము" అని పైవిలాసమున్నది]


                                         మద్రాసు, 1831 వ  సం|| డిశంబరు 15వ తేది.

నాప్రియమైన అయ్యా,

నేను నాకుటుంబఒతో కిందటి సెప్టెంబదు నెలలో సుంఖంగా చెన్నపట్టణం చేరి సుప్రీముకోర్టులో నా (ఇంటర్ ప్రిటర్) పని చూడడం ప్రారంబించినాను. నేను చాలాకాలము సెలవులో వున్నందున చేయవలసిన పని పెరిగి పోయి యున్నది. అందువల్ల తమకు ఇంతకుపూర్వము జాబు వ్రాయలేక పోయాను. ఇందుకు నన్ను క్షమింప వేడుతాను.


.