పుట:Kasiyatracharitr020670mbp.pdf/217

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ఈ కాశీస్థలానికి బాధ్యులుగా గంగాపుత్రులనే వారు 1200 యిండ్లువారు ఉన్నారు. వారు క్షాత్రశౌర్యాల చేత దొరతనము చేసే వారని, గంగాయాత్ర చేయ వఛ్ఛేవారివద్ద గుఱ్ఱానికి 12 రూపాయల వంతున నున్ను, మనిషికి 4 రూపాయల వంతుననున్ను, గాడీకి యాభై రూపాయల వంతున నున్ను యాత్రవచ్చే వారిని ముందుగా చూచిన గంగాపుత్రుడు తీసుకొని మణికర్ణికలో స్నానము చేయింపుచు, యివ్వక స్నానముచేసి మొండాటలాడితే కొట్లో వేసి కోర్టు సెలవులతోకూడా తీసుకుంటూ, బహుశా యియ్యని వారిని యియ్యచాలని వారినిన్ని తమ పోకిరితనము చేత మానభంగమున్ను, దేహబాధయున్ను పెట్టుతూ వచ్చుచున్నారు. వీరికి భయపడి శరభోజీ మహారాజు *అంతటి వాడు, కేదార ఘట్టమే వృద్ధమణికర్ణికయని ఒక పురాణ ప్రమాణమును పట్టి క్షౌర శ్రాద్ధాలు కేదారఘట్టలో గడిపినాడు. విజయనగరపు రాజు కాశికి వచ్చిన్ని ఒక సంవత్సరము మణికర్ణిక స్నానము లేక నుండినాడు. యిక పేదల గతి చెప్పవలసినది లేదుగదా! యిటువంటి సమూహమువల్ల నాకు ఒక అభ్యంతమున్ను లేకుండా నన్ను రామటెంకివద్ద యెదురుకున్న రామరహల్లు అనే గంగాపుత్రుడు గోపీగంజులోనే నేను యిచ్చినది తీసుఒని యాత్ర చేయించేటట్టు దస్తవేజు వ్ర్రాసియిచ్చి ప్రయాగ వరకు కూడావచ్చి నా సహితముగా కాశి ప్రవేశించి నందున యధాశాస్త్ర ప్రకారము మహా స్థలము చేరిన మరుసటి గడియకే మణికర్ణికకు వెళ్ళి అక్కడ చక్రతీర్ధములో భేటికి అని ఒక మొహరు ఫలపుష్ప సహితముగా నుంచి ముందర స్నానము చేసి పిమ్మట క్షౌరానికి సంకల్పము చేసుకొని క్షౌరానంతరము మణికర్ణికలో స్నానముచేసి గంగాపూజ చేసి గంగాపుత్రుల సమూహానికి భూరి దక్షిణ అని పదిహేను రూపాయలు, ఘాటీయాలనే గంగాతీర స్నాన ఘట్టమునందు వుపచరించేవారి కని, పదిరూపాయలు, కంగాళీల


  • ఈయన తంజావూరి మహారాజు, 1788 లో తండ్రి చనిపోవునాటికి 9 ఏండ్లవాడు. పినతండ్రి రాజ్యాక్రమణ చేయిగా కుంఫిణీవారి నాశ్రయించి 1797 లో రాజ్యము పొందెను గాని రెండేండ్లలోనే పించనుదారు డయ్యెను. ఈయన 1833 లో చనిపోయినాడు. బిషప్ హేబరు 1826 లో ఈయనను దర్శించినాడు.