పుట:Kasiyatracharitr020670mbp.pdf/210

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


రసాన్ని మానుష కోటికి వెనకతట్టు పూసి యున్నారు. అటువంటి రసము పూసిన అద్దాలకు కూడా యెట్లాచూచే పక్కముందుగా దుమ్ము అనే కల్మషము కప్పివుంటుంతో తద్వత్తుగా మౌఢ్యమనేమాలిన్యము మనుష్యులకు కమ్మిఉంటున్నది. ఆఅద్దాలపై కల్మషాన్ని మనుష్యులుతుడిస్తే యెట్లా తమప్రతిభాతి స్పష్టముగా తెలుస్తున్నదో తద్వత్తుగా సత్సంగతి కల్గడమువల్ల మనుష్యుల మౌఢ్యము వదిలి యీశ్వరాభాతి మనుష్యులబుద్ధిలో సంపూర్ణముగా కలగడానికి హేతువవుచున్నది.

బహుదినములుగా స్త్రీలు తిర్యగ్జంతువులవలెనే మోక్షార్హులు కాక నున్నారే! పుల్రుషులకు భోగార్హలా లేక పురుషులవలెనే వీరున్ను జ్ఞానవంతులయి మోక్షార్హులా? అనే శంక నాకు కద్దు. తిరువళ్ళూరి మహాముని రఘునాధాచార్యులు మొదలయిన పెద్దలను గురించి స్త్రీలు మోక్షసాంరాజ్యాన్ని పొందినట్టు భారత భాగవతాది సారవత్తు లయిన యితిహాస కధలలో యెక్కడనైనా వున్న జ్ఞాపకము గాని వున్నదా? తుదను స్వర్గాది భోగాలయినా వారు అనుభవించినట్టుగా గాని వున్నదా? తుదను స్వర్గాది భోగాలయినా వారు అనుభవించినట్టుగా గాని వున్నదా? అనిన్ని యితిహాసాదులలో పురుషులకు ఫలాని ఫలాని సుకర్మమును చేస్తే స్వర్గములో అనుభవించడానికి రంభాద్యప్సరసలు వున్నారని ఆశ చూపించియున్నిదిగాని ఫలాని మంచి కర్మము స్త్రీలు చేసుటవల్ల ఫలాని దెవతలతో స్వర్గములో క్రీడిస్తూ వుండవచ్చునని ఆశకూడా చూపలేదే! స్త్రీలు జ్ఞానవంతులయి మోక్షార్హులు యెట్లా అవుదురని ప్రశ్నచేస్తూ వచ్చినాను. వారువారు శానా ప్రయాసపడి స్త్రీలను పు;రుష సమానులుగా స్థాపించవలెనని యుక్తులు చెప్పినా దేవహుతి మొదలయిన తత్వబోధగల స్త్రీలనుగూడా వివాదములో దృష్టాంతములుగా తెచ్చినా తుదను నాసందేహమే వారినిన్ని పట్టుకున్నది గాని తేరుగడ అయినదికాదు.

నా బుద్ధిద్వారా నిశ్చయము చేసినది యేమంటే స్త్రీలకు పురుషులకున్ను హృత్కమలములు ఊర్ధ్వాధోభాగములయందు రెండేసి గ్రంధులనే ముళ్ళుగలిగి వుండేది నిశ్చయము. ఆధోభాగమందుండే గ్రంధి పరమాత్మ సంబంధమయిన దిన్ని ఊర్ధ్వభాగమందుండే గ్రంధి సంకల్పరూపం బయిన మాయా సంబంధ మయినదిన్ని ఔను.