పుట:Kasiyatracharitr020670mbp.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

7

ఏనుగుల వీరాస్వామయ్యగారు; వారి మిత్రులు

నవయుగారంభం

చెన్నపట్నంలో ఒక ఇంగ్లీషు కాలేజీ స్థాపించడం అవసరమనిన్నీ తాముకూడా కొంతసొమ్ము విరాళం యిస్థామనిన్నీ ప్రభుత్వం స్థాపించే విధ్యాశాఖపరిపాలనలో తమకుకూడా కొంత అధికారమూ పలుకువడీ వుండాలనిన్నీ కోరుతూ ఒక మహజరు తయారుచేసి 70 వేలమంది సంతకాలుచేసి జార్జీనార్టన్ గారి ద్వారా 1838 నవంబరు లో గవర్నరుకు అందచేశారు. అంతట గవర్నరు ఎల్ ఫిన్ ష్టన్ గారు ఇంగ్లీషువిద్యావిధానం స్థాపించడానికి నిశ్చయించి కొందరు దొరలు, స్వదేశీయులును గలఒక యునివర్సిటీ బోర్డును 1839లో నియమించారు. అందులోమన రాఘవాచార్యులు గారు, శ్రీనివాసపిళ్ళెగారుకూడా సభ్యులు. దానికి జార్జి నార్టన్ గారు అధ్యక్షులు. తరవాత స్థాపింపబడిన మద్రాసు యునివర్సిటీ అనే ఉన్నత పాఠశాల పరిపాలక వర్గంలోకూడా వీరిని సభ్యులుగా నియమించారు. 1841 ఏప్రిల్ నెలలో జరిగిన ఆ ఇంగ్లీషు ఉన్నత పాఠశాల ప్రారంబోత్సవంలోప్రజలు ఉత్సాహంచూసి ఒక నూతన యుగం ప్రారంభమైందని గవర్నరుగారే అన్నారు.

శ్రీగాజుల లక్ష్మీనర్సు సేట్టిగారు

ఫీరాస్వామయ్య ప్రభ్రుతులు ప్రజాసేవ ప్రారంబించిన ఏడేండ్లలోనే చెన్నపట్నం లో ఆంధ్రవర్తకులైన శ్రీ గాజుల లక్ష్మీనర్సుసెట్టిగారు రాజకీయనాయకులై కుంపినీపరిపాలనలోవున్న లోపాలు మిషనరీచేస్తూవున్న అన్యాయాలు ప్రజల కష్టాలు పైవారికి తెలియచేసి రాజ్యాంగ సంస్కరణల కోసం పాటుపడడానికి చెన్నపట్టణ స్వదేశసంఘాన్నీ క్రెసేంటు అనేజాతీయపత్రికను 1844 లో స్థాపించి గొప్పరాజకీయ ఆందోళనలేవదీసి ఇరవైఐదేండ్లు ప్రజాసేవచేశారు. ఇలాగ తరువాత కలిగిన విద్యాభివృద్దికీ జాతీయ చైతన్యానికీ ఉత్తరదేశంలో రమమోహనరయల లాగ ఇక్కడ మన శ్రీనివాపిళ్ళె, వీరాస్వామయ్య ప్రభృతులే పునాదివేశారని నిస్సంశయంగా చెప్పవచ్చు. పచ్చయప్పకళాశాలాభవనంలో వున్న జాన్ బ్రూస్ నార్టన్ గారు ఈదక్షిణ హిందూస్థానంలో ఇంగ్లీషు విధ్యాభివృద్దికి మూలపురుషులు వీరేనని ప్రశంసించారు.

చరిత్ర సాధనాలు

ఏనుగుల వీరాస్వామయ్య గారి జీవితాన్నిగురించీ వారి కాలంనాటి స్థితిగరులను గురించీ వారు చేసిన ప్రజాసేవగురించీ శ్రీనివాసపిళ్ళె ప్రభృగులను గురించీ ఇంకా వివరాలు తెలుసుకోగోరేవారు ఈక్రింది పుస్తకాలు, పత్రికలు, చూడవచ్చును.

Rudimentals,--by George Norton (1851) Educational speeches of The Hon.John Bruce Norton 1853-1865 The Madras Journal of Education Aprfl 1868, p p.154-155 Asylum Press Almanac. Madras, 1820-1835 Histoiy of Pacbaitppa's Charities