పుట:Kasiyatracharitr020670mbp.pdf/209

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ధననున్ను యేమి వద్దు, మనసా యీశ్వర భజన చేస్తూ వుండవలసినదని చెప్పుతారు. తురకలున్ను, అందు కనుసరణగా అనేక ప్రకారములయిన కర్మాలు తజ్జనిత మయిన ఆరాధనలున్ను వుంటే బుద్ల్ధి నిశ్చయము తప్పి పోతున్నది గనుక, ఒకటి రెండు విధములయిన కర్మాలను ఆరాధనల నున్ను యేర్పరచుకొని ఆమూలగముగా యీశ్వర భజన చేస్తున్నారు. తురకలకున్ను క్యాధేలిక్సులకున్ను తాము చేసే కర్మారాధనలలో వివాదమే కాని తత్త్వములో వుండనేరదని తోస్తున్నది.

భగవత్పాదు లయిన శంకరాచర్యులవారు అవతరించి దిగ్విజయము చేయక ముందర యీ కర్మభూమిలో దేహమే బ్రహ్మమని వాదించే ఒక ప్రమాదమయిన బౌద్ధమతము ప్రసిద్ధముగా వుండెను. యిప్పుడు ఆ మతము యీ దేశమందు ఖిలమయినా అంకురాలు మాత్రము అక్కడక్కడ ఉన్నవి. ఆ మతము పాలునే నెయ్యి అన్నట్లు స్థూల దేహాన్ని బ్రహ్మముగాను, యీశ్వరుడుగాను, అనేక దృఢయుక్తులతో వ్యవహరిస్తున్నది.

సచ్చిదానందమయిన పరబ్రహ్మ సంకల్పమనే మాయతో యుక్తుడయి సృస్టించిన అనేక బ్రహ్మాండములలో వసించే సృష్టి సంబంధమయిన యావజ్జనులున్ను అద్వైత విశిష్టాద్వైత ద్వైత దేహబ్రహ్మవాద మతాలకు లోబడి వుండవలసినదే కాని యితరముకాదని తోస్తున్నది. లేనిపక్షమందు దైవము గలదనే జ్ఞానలేశము లేకుండా ద్విపాత్పశువుల వలెనే ప్రవర్తింపుచు ఉండవలసినది. యింత కెక్కువ వేరేవుండనేరదు.

జ్ఞానజంతువు లయిన మనుష్యులకు ఆజ్ఞాన జంతువులయిన మత్వాదులకున్ను భేదమేమని విచారిస్తే యెట్లా అద్దాలంతా ఒకటే జనుసో తద్వత్తుగా జంతువులంతా ఒక దినుసేగాని వేరుకాదు. అయితే మన ప్రతిభాతి పుట్టవలసిన అద్దాలకు వనకతట్టు యెట్లారసము పూస్తామో తద్వత్తుగా యీశ్వరుడు తన ప్రతిభాతి కలిగే కొరకు బుద్ధి అనే