పుట:Kasiyatracharitr020670mbp.pdf/208

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యొక్క తత్వము, అద్వైతమతముయొక్క తత్త్వమేమంటే సృష్టికిన్ని సృష్టికర్తకున్ను, దీపికా న్యాయముగా భేదములేదనుట. విశిష్టాద్వైత తత్వమేమంటే సృష్టికిన్ని సృష్టికర్వకున్ను పాలతో కలిసి వుండే నెయ్యివలెనే కించిత్తు భేధము చెప్పడము. ద్వైత తత్త్వమేమంటే పాలు పెరుగు మజ్జిగె మజ్జిగెతేట నెయ్యి యివి భేదిస్తే భేదపడు చున్నవి గనుక వీటివలెనే యీశ్వరునికిన్ని జీవునికిన్ని భేదము ఉండడము మాత్రమే కాకుండా అనేక భేదాలు జీవులలో కూడా కల వనడము యీ మూడే యిదివరకు తీరని వివాదాలుగాని శివుని కన్నా విష్ణువు సర్వోత్తముడని వైష్ణవులున్ను, శివుడే వుత్తముడని శైవులున్ను వీరిద్దరికన్న శక్తి యెక్కువని శాక్తులున్ను, వివాదపడడమున్ను అందరికి యెక్కువ గణపతి అని గాణపతులు వగయిరాలు వివాద పడదమున్ను స్వప్రయోజనకారి కాదు. యేలాగంటే విందుకు వండిన కూరలు మొదలయిన వ్యంజనాలలో యెవరికి లేహ్య భక్ష్య బోజ్య చోష్యములలో యేది సమ్మత మయితే వారు అది యెత్తి భక్షించ వచ్చును; విందు చేసేవానికి కావలసిన ప్రయోజనము బోజనము చేసిన వారికి యెట్లాగయినా కడుపు నిండవలసినది. శైవ వైష్ణవరాధనలను కలగచేసిన మతోద్ధారకులకున్ను అదేప్రకారము తమతమ మత ప్రవిష్ణులు తత్వము తెలుసుకొనేవరకు ఒక విధమయిన నామ రూపాలు యేర్పరచుకొని ఈశ్వర జ్ఞానముతో ఈశ్వరుని యెడల భక్తికలిగి గుండవలేననిగాని వేరే కాదు. జ్ఞానోదయము కావడానికి శాస్త్ర నిచారణమాత్రము చేసి యిక్కడి సమస్తజనులున్ను, బహుశ: అద్వైతద్వైతమత ప్రవిష్ణులుగానే వున్నారని నాకు తోచబడుచున్నది. మనదేశములో వుండే ద్వైత మతస్థులయిన మాధ్యులు ధరింఛే చక్రముద్రలు మాత్రము యీ దేశములో బహుమంది గోపీతో వేస్తారు.

క్రీశ్తు మతస్థులలో ప్రోటెష్ట్యాంట్సు అనే జాతులవారు విశిష్టాద్వైత మతాను సారముగా సృష్టికర్త అయిన యీశ్వరుడు చేతనా చేతనాత్మక మయిన అనేక జీవులను సృష్టించినాడు; కర్మలు తదంగమయిన ఆరాధనలవల్ల యీశ్వర దృష్టి అల్ప వదార్దాలమీద కలిగెతే ప్రమాదాన్ని యిస్తున్నవి గనుక, కర్మాలున్ను, తజ్జనితమయిన ఆరా