పుట:Kasiyatracharitr020670mbp.pdf/207

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆగోసాయీలకు నియమముచేసి యున్నారు.. ఆగోసాయీలకు యెవరు నమస్కారము చేసినా యిప్పటికిన్ని నారాయణ స్మరణ చేయుచున్నారు. యీగోసాయీలందరున్ను, వనా, రణా, గిరి , పర్వత్, సాగరా, భారతీ, పురీ, సరస్వతీ, తీర్ధ, ఆశ్రమ, యీ పది నామధేయములకున్ను అంతర్భూతులయి యుంటారు గాని వేరేయుండరు.

యీ తెగలు గాక బయిరాగులని కొందరు విరక్త్యభినయాలు బహుశా కలిగి తెంగల నమధారులయి సంచరింపుచు నుంటారు. వారికి గురుపీఠముగా మన ద్రవిళదేశము నుంచి కొంతమంది వైష్ణవులు కొన్ని కాలములలో అచ్చి సమశ్రయణము చేసి వారిగుండా బహుధనమును సంపారించుకొని పోవుచున్నారు. వారు విష్ణుభక్తులయినా ద్రవిడ దేశములో అద్యైతులకున్ను, విశిష్టాద్వైతులకున్ను, సగుణనిర్గుణ వివాదము పడినట్టు యిక్కడ లేదు.

యీ దేశము యావత్తున్నూ తరుచుగా శ్రీమచ్చంకరాచార్యులవారు స్థాపించిన అద్వైత మతము చెతనే వ్యాపింపబడి యున్నది గాని పిమ్మట రామానుజాచార్యులు వారున్నూ, మధ్యాచార్యులవారున్ను, అవతరించి స్థాపించిన విశిష్టాద్వైత ద్వైతాలు యీ సరికి నకృచ్చముగా నెగబడినదికాదు. సకలమైన వారున్ను ఏమిన్ని భేదములేకుండా విభూతిన్నీ, గోపీచందనమునున్ను చందనమునున్ను లలాట మందు ధరింపుచున్నారు. బయిరాగులు మాత్రము తిరునామమును పయిన వ్రాసినట్టు ధరింపుచున్నారు.

శైవ వైష్ణవ పౌర శాక్తములు మొదలయిన మతాలన్ని అద్వైత విశిష్టాద్వైత మతాలకు అంతర్భూతము లయినవే గనుక యీ మూడు మతస్థులున్ను శైవవైష్ణవములు మొదలయిన ఆరాధనలు ఏవి చేసినా చేయవచ్చును. ఈ ఆరాధనలన్ని కర్మాలకు అంగుములే కాని వేరేకావు. మత రహస్య మనే వృక్షమూలము గురుముఖముగా తెలియవచ్చినప్పుడు కర్మాంగములయిన ఆరాధన లన్నియు తమకు తామే నివర్తించి పోవుచున్నవి. మత రహసమనగా ఆయా మతము