పుట:Kasiyatracharitr020670mbp.pdf/205

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గాని జ్ఞానానికి ప్రత్యక్షమైన సాధనము కాదు గనుక నున్ను, యీ భూమి మ్లేచ్చా క్రాంతమై పోయిన వెనక గంగాయమునల మధ్యే నివసింపుచు నున్న కర్మఠులయిన ద్రావిళ్ళు శుద్ధ ద్రవిడ దేశములయిన కావేరీ తామ్రపర్ణీ తీరములలో ప్రవేశించినందున అక్కడి వారు కర్మోపయోగిగా వేధాంతము తెలియక పోయినా వేద పారాయణము చేయడములో ఫలము కలదని ఫలశృతులు కలగచేసి బహుశ: వేదపాఠము పారాయణానకు ఉపయోగముగా జరిగిపుంచు వుండేటట్టు తోచుచున్నది.

యిప్పుడు పంచగౌడులని యిక్కడ వసింఛే వారికి గౌడులని పేరు రావడానకు కారణమేమంటే కర్మకులమయిన ద్రావిళ్ళు యీ గంగాయమునలమధ్యే వసింఛే కాలములో కర్మములయెడల శ్రద్ధ తక్కువైన వారైనందున వీరిని గౌణులు అంటూ వచ్చినారు. ఆనామమే యిప్పుఛు గౌడులని ప్రసిద్ధమైనది. కర్మఠులు యీ రాజ్యము వదిలి పోయి ఢిల్లీనుంచి వచ్చిన తురకలచేత ఈ రాజ్యమంతా నిండిపోయినందున నిండా కర్మకులు కాకుండావుండే గౌడులకు ఆ తురకలటో సహవాసము కలిగి నందున ఉచ్చారణలుకూడా ఆ తురకభాషను అనుసరించినవి. ఆచారాలు కూడా తద్ధ్వారానిండాభేదించి పొయినట్టు చెప్పుచున్నారు. ఈ దేశము తురకదేశమునకున్ను, హిందూ దేశమునకున్ను, నడుమనుండే సింధునదికి సమీప మయినది గనుక తురకలు ఢిల్లీ ప్రవేశించగానే వారు ఈ దేశాచార విరుద్ధ కర్మకు లయినందు వారివల్ల ఉపద్రఫము కలగ పోవుచున్నదని భయపడి యిక్కడి కర్మకులయిన ద్రావిళ్ళు పయిన వ్రాసిన ప్రకారము శుద్ధ ద్రవిడదేశములో ప్రవేశించినారు. అదినుంచి కర్మకులు గాని గౌడులు,యిప్పటికి ముక్తికి తగ్గ దారియయిన జ్ఞాన సంపాదనార్దమై తర్కము, మీమాంస మొదలయిన శాస్త్రములను అభ్యసింపు చున్నారు.

కర్మద్వారా, జ్ఞానమనే న్యాయ మార్గమును బట్టి కర్మమనే మజిలీయూరి మెదుగా జ్ఞానమనే పురమునకు పోతే దేహాన కున్ను, ప్రాణాలకున్ను, ప్రయాస యియ్యదు. కర్మమనే మజిలీలో నిలిచి ఆసోదా చేసుకోకనే జ్ఞానమనే పురమునకు ఒక్కసారిగా వేరే