పుట:Kasiyatracharitr020670mbp.pdf/204

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

త్పూర్వము గంగాస్నానముచేసి యిండ్లకు పోతారు. పిమ్మట పురుషులు స్నానానికి పోతున్నారు. యిక్కడి స్త్రీలకు స్వరూప సౌందర్మమే కాని ఆభరణాపేక్ష విస్తారము మనదేశమువలె కలిగిన వారు కారు.

మిరిజాపురము మొదలు ప్రతి మజిలీ వూరిలో బాడిగెకు గుఱ్రాలు కోసుకు ఒక అణావంతున కావలసినన్ని దొరుకుతున్నవి. తిరుల్వలిక్కేణి గాడీలవంటి గాడీలకు ఒక తట్టువాని గుర్రాన్ని కట్టి యెక్కా అని పేరు పెట్టి వారు వారు యెక్కడము మాత్రమే గాక కావలసినన్ని బాడిగకున్ను యిస్తూవున్నారు. ఆ యెక్కా అనే సవారీ దినానికి 10 కోసుల సాధారణముగా పొవుచున్నది.

దక్షిణదేశములో వస్త్రాలు ఆ దేశస్థులు బహుశ: ప్రయాసపడి ఉతికి శుభ్రముగా వుంచుకొని వుండేటట్టు, ఈ దేశాస్థులు వాడుకునే పాత్రసామాను శానాసేపు ప్రయాసపడి తోమి బహు శుభ్రముగా వుంచుకొనుచున్నారు. యీ దేశస్థుల పస్త్రాల నైల్యమున్ను, మనదేశస్థుల పాత్రల నైల్యమున్ను, సమముగా ఉన్నది. యిందుకు కారణము నాబుద్ధికి తోచడ మేమంటే దక్షిణదేశస్థులు భొగప్రియులు గనుక వస్త్రసౌందర్యము కలవారయినారు. ఉత్తరతేశస్థులు భుక్తి ప్రియులు గనుక భక్షణోపకరణాలు శుభ్రముగా వుంచుకొనుచున్నారు. ఈదేశస్థులు యెనిమిదిమంది చేరితే తొమ్మిది పొయిలని ప్రసిద్ధిగనుక, వంటలు వారువారు దేహసంబంధికులయినా ప్రత్యెకముగా చేసుమొని మనదేశపు వైష్ణవులవలె దృష్టి దోషము మాత్రము పాటించకుండా భోజనము చేస్తారు.

మిరిజాపూరు మొదలు ప్రయాగవరము భూమినిండా సారవత్తు కాకపోయినా గంగవొడ్డు భూమిగనుక ప్రవాహము తీసిన కాలాలలొ దున్ని పయిరు పెట్తుచున్నారు. గంగవండలి మన్ను అతి సారవత్తు అయినది గనుక అమితముగా గోధుమలు వగయిరా పుంజధాన్యములు పండుచున్నవి. ఈదేశములో వేదపాఠము లేకునున్ను, వేదపారాయణము లేకనున్ను, ఉండడానికి కారణమేమని నా బుధ్యా ఊహించగా అర్ధము తెలియని వేదపాఠము యేమివున్నా శ్రౌత పురస్సరముగా యాగము మొదలయిన కర్మాలకు ఉపయోగమే