పుట:Kasiyatracharitr020670mbp.pdf/203

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రమాదాలనున్ను, యింకా కలగ గల ప్రమాదాలనున్ను, నాకు తొచిన మట్టుకు తెలిశేటట్టు ఒక యాదాస్తు శీకష్టం కలకటరు మేస్తరు నీపన్ (Mr.Nepean) దొర కోరినమీదట వ్రాసియిచ్చినాను.

మేస్తర్నీపన్ దర నాతో మత సంబంధమయిన ప్రసంగము వచ్చినప్పుడు యీ నదులను యీ గుళ్ళను యీశ్వరుడని నమ్ముతావా అని ప్రశ్నచేసెను. చెన్నపట్టణంకు చూడని మీకు, హిందూస్తాన్ ప్లాన్ యెత్తి యిదుగొ చెన్నపట్టనమని చూపిస్తే అది చెన్నపట్టణమౌనా? చెన్నపట్టణము ఫలాని తావున వున్నదని బోధ చేయవలసినవారికి వారిని చెన్నపట్టణానికి పిలుచుకుని పోయి ప్రత్యక్షముగా చూపించను వల్ల లేని పక్షమందు, ప్లాన్ గుండా నయినా చూపించవలసినది అగత్యము గనుక, యెట్లా ప్లాన్ వ్రాసి మీరు యెరుగని దేసాలను ప్రకటనము చేయుచున్నారో తద్వత్తుగా జ్ఞానముచేత యీశ్వరుని తెలుసుకో లేని వారికి ఈ కర్మస్థలముల మూలముగా యీశ్వరుని యెడల భక్తి కుదిరేటందుకు యిటువంటి స్వరూపాల యెడల యీశ్వరజ్ఞానము ఆరోపితము చేసి ఆరాధనోపాయములు మాపెద్దలు చేసినారు, అని ప్రత్యుత్తర్వు యిస్తిని. అయితే నీవు క్రీస్తు మతస్థుడవేకదా! అని చెప్పి సమ్మితి పడినాడు.

ఈదేశములో మహారాష్ట్రులు మొదలయిన ద్రావిళ్ళును, ఘూర్జరులతో భోజనప్రతి భోజనాలు చేయడము లేదు. అందుకు కారణము ఘూర్జరులు శంకరాచార్యులవారి శాపగ్రస్తులని చెప్పుచున్నారు. యిక్కడ వాసమి చేసే పంచ గౌడస్త్రీలు రవికెలు తొగడములేదు. తురకసంప్రదాయ ప్రకారము ప్రతిస్త్రీలున్ను ముసుకులేకనే బయటరారు. ఆరుమూర నిడివి, నాల్గు మూర వెడల్పులో చంగావివేసిన మంచిరేకు విత్తముకొద్దీ తీసి ముసుకుగా ముఖముకూడా తెలియకుండా దేహ మాద్యంతము కప్పుకొనుచున్నారు. గంగారీరందు వసించే సకలజారులు స్నానము శివపూజ చేయకనే జలపానము చాయడములేదు. పుణ్యనదుల తీరములలో వుండే వారి కంతా యిదే షాననియమము కలిగినట్లు నా అనుభవము నాకు తోపచేయుచున్నది. స్త్రీలు అందరు వుదయా