పుట:Kasiyatracharitr020670mbp.pdf/202

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వాళీ తీసుకొంటాడు. యీపాటి, నాకుండా యీ స్థలములో యీశ్వరుడు జరిపించడము వల్ల చెన్నపట్నానికి యశస్కరుముగానే వుండినది.

నేను ప్రయాగవాసము చేసినన్నిదినములు వైదికుల సమూహము తోనే కాలము తోయడమయినది గాని హయిదరాబాదు వగయిరా షహరుల వలెనే లౌకిక సహవాసము నేను త్రివేణీతీరమునందు దిగినందున నిండా తగిలినది కాదు. యీ ప్రయాగలో నాలుగు పటాలాల బారూన్నది. ఆ దండు వుండే స్థలము బస్తీకి రెండుకోసుల దూరము. నా మీద దయచేసి నేను సేవచేసిన సర్ జాన్ న్యూబోటు, (Sir John Newbolt)* సర్ చర్లీనుగ్రే మదలయిన దొరలు వ్రాసి యిచ్చిన క్యారకటరులు యీ పరస్థలాలలో నున్ను యింత గొప్ప చేస్తున్నవి.

సర్వాంతర్యామిగా వుండే పరమాత్ముడు యేలే స్వామిలో యేలబడే వారి యాత్మలలో దీపించుటకంటే యెక్కువ దీప్తితో ప్రకాశించుచున్నాడు. గనుక స్వామిభృత్యన్యాయముగా మనుష్యుడు నడుచుకొంటే పరమాత్ముడు ఆనందించి ఆ నడిచిన వానికి సకలేష్టసిద్ధులు కలగచేయు చున్నాడు. యిందుకు యే మాత్రమున్ను సందేహములేదని తోస్తున్నది.

బంగాళా గౌర్నమెంటువారు పినాన్సుకమిటీ అనే సెలవులు తగ్గించే సమూహము వారి తాత్పర్యము మీద అక్కడక్కడ ఉండే కష్టం హవులనే సాయరు చావిళ్ళు యెత్తివేసి చెన్నపట్టణమువలెనే కష్టం అనే సుంకమును యీజారాకు యివ్వవలె నని యత్నముచేసినారు. యీ రాజ్యములో వుప్పుకు తీరువగాని చెన్నపట్టణమువలె మొనాపొలీ చేసి సుంకము యీజారాకు యివ్వడములేదు. చెన్నపట్టణమువలె జరిగించడము యీ దేశస్థులకు సమ్మతము లేక నున్నది. అందువల్ల సుంకము యీజారాకు యివ్వడములో యిటీవల చెన్నపట్టణములో తూకున (ఉరి) తీయబడిన అణ్నాసామి వగయిరాలకంతా కలిగిన


  • న్యూబోల్ టు గారు చెన్నపట్టనములో 1815 నుండి 1820 వరకు సుప్రీము కోర్టు ప్రధమ న్యాయమూర్తిగా వుండేవారు.