పుట:Kasiyatracharitr020670mbp.pdf/201

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పెట్టి 3 కొట్టాయీలు వేయించినాను. బహు రమణీయముగా వుండినవి. ఆచప్పరాలు బాడిగెకు యిచ్చిన బనయావాడు అక్కడనే ఒక అంగడి తెచ్చిపెట్టినాడు. సకల సమానులున్ను వాడివద్ద పుచ్చుకొన్నాము. మకర మాసంలో వచ్చే జనము దిగడానికి బనయావాండ్లు వేలపర్యంతము చప్పరాలు కట్టి యీలాగంటి కొట్టాయీలు వెసి అడుగుకు పావులావంతున బాడిగె తీసుకొని మీది మిక్కిలి ఆ దిగిన వారిని మరియొక తావున సౌదా అనే సామాను కొనకుండా నిర్బంధపెట్టుతారు. అయితే యిటువంటి చప్పరాలు కావలసినన్ని బాడిగెకు దొరుకుచున్నవి.

నేను యెల్లప్పుడున్ను త్రివేణీదర్శనము కాగల ద్వారకాదాసు ధర్మశాలలో దిగినాను. యీ స్థలములో వశించినన్ని దినాలున్ను ప్రతిదినమున్ను ఉదయాన యీ చప్పరాలకు వచ్చి సాయంకాల పర్యంతమున్ను యిక్కడనే వుండి రాత్రి పడకకు ధర్మశాలకు పోవుచు వచ్చినాను. ప్రయాగవాళీలకున్ను ఘాటీ వారికిని యింటికి రెండేసి అణాల వంతున సుమారు 1100 ఇండ్లకున్ను, ముట్టచెప్పినంతలో వారందరున్ను సంతొష పడిరి. యిక్కడికి గొప్పవారు వస్తే స్నాన ఘట్టములో ఒక బలంపీట నున్ను ఒక జండానున్ను వేయడం వాడికె గనుక పదిరూపాయలలో రెండున్ను నన్ను అనుసరించిన శంకర ఘాటీకానును తెమ్మని స్నాన ఘట్టములో వేసి అతని అధీనము చేసినాను. క్షౌర గనమున్ను, వేణీదాన దినమున్ను, భూరి యివ్వడములో 14 రూపాయల పయిసాలు తగులుచున్నవి. అందులో అన్ని జాతులు చేరుతారు. త్రివేణిదానానికి మరునాడు నా ప్రయాగవాళీ యింట్లో ప్రయాగవాళీలకు నూరుమందికి సంతర్పణ చేసినాను. దక్షిణ సహితముగా 24 రూపాయలు మట్టుకు ముట్టచెప్పినంతలో ఆనందించి నాతోకూడ వచ్చిన ప్రతి శూద్రుని చేత నేను మనిషి 1 కి యిచ్చిన రెండేసి అణాలు తీసుకొని తీర్ధవిధి పిండప్రదాన సహితముగా చేయించినాడు. పంచద్రావిళ్ళుపెట్టే శ్రార్ధాలజోలికి వారు రావడములేదు. పిండ దక్షిణ అనే పేరుతో బ్రాహ్మణార్ధము చేసే ఒక బ్రాహ్మణునికి యిచ్చే దక్షిణంత ప్రతి శ్రార్ధానికిన్ని ప్రయాగ