పుట:Kasiyatracharitr020670mbp.pdf/200

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ఆరాధనను విధిగా యేర్పరచినారో యెట్లా వైష్ణవ మతస్థులలొని మద్యపాయలు తరించడానికి రహస్య రామానుజకూటారాధనను నియమించినారో తద్వత్తుగా లోకముమీద విసుకుచేత దేహమును బలాత్కారముగా త్యజించడానికి నిశ్చయించినవారు తరించడానికికూడా యీ ప్రయాగ మహాత్మ్యద్వారా దేహత్యాగము విధిచోదితముగా చేసినట్టు తోచుచున్నది. మెట్టుకు యీ కర్మభూమిని జనియించిన తిర్యగ్జంతువులు కూడా ఒక విధమైన భక్తి యీశ్వరుని యెడల కలిగి తరించవలసిన అగత్యము పూర్వీకులకు కలదు గనుక వాని వాని శక్తికి, ఇచ్చకున్ని, యెక్కువగా పనులు నియమిస్తే చెయక తద్ద్వారా యీశ్వరభక్తి లేక ముణిగిపోదురు గనుక వారి వారి ఇచ్చకు, శక్తికిన్ని, అనుకూలమయి నట్టుగా; సారాయి తాగితే తాగినావు యీశ్వరాప్రణమని ఒక విధమయిన ఆరాధనతో తాగు అన్నట్టు; ఆత్మహత్య చేసుకుంటే చేసుకున్నావు; యీశ్వరార్పిత మని శ్రద్ధతో ఫలాని తావుకుపోయి విధి పూర్వకముగా చేయుము అనేటట్టుగా యిక్కడ నియమించినారని నాకు తొచుచున్నది.

త్రివేణి గర్భములో కోటగోడకింద నాకోసరము తత్పూర్వమే చప్పరాల కొట్టాయీలు వేయించి వున్నందున అందులో తీర్ధశ్రాద్ధాదులు పెట్టించినాను. బ్రాహ్మణుడు 1 కి రూపాయి వంతున దక్థిణ యిచ్చినాను. ఆ బ్రాహ్మణులున్ను, అందుకు సంతొషపడిరి. ప్రయాగవళీల స్త్రీలు రాణివాసము గలవారు గనుక తెనుగు మహారాష్ట్ర ముత్తయిదువలు 12 మంది దొరికి నందున వారికి మాయింటి స్త్రీలతొ కూడా ఆ చప్పరాలలో ముందుగా యిక్కడి వాడికె ప్రకారము గాజులు తొడిగించి అభ్యంగనాలు చేయించి నూతన వస్త్రాలను ధరింప చేసి మేళతాళాలు స్వస్తి వచనములతో కూడా త్రివేణీ సంగమము వద్దికి వెళ్ళి వేణీదానము యిప్పించినాను.

యీ చప్పరాలు 16 రూపాయల బాడిగెకు బనయావాడి (కోమటి) వద్ద నిష్కర్షచేసుకొని పయిన 10 రూపాయిలు ఖర్చు చేసి అరవ భాష - పఆన (--- అను అక్షరస్వరూపము) అందముగా కొట్టాయీ 1 కి 40 అడుగుల నిడువున్ను 16 అడుగుల వెడల్పున్ను