పుట:Kasiyatracharitr020670mbp.pdf/20

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


6

ఏనుగులవీరాస్వామయ్యగారు; వారిమిత్రులు

నాటిపరిపాలనకోసం చెన్నపట్నం సుప్రీముకోర్టులో ఒక్కస్కీము తయారుచేహించారు. ఆ ప్రకారం 1832 లో ఏర్పాటు చేయబడిన మొదటి ధర్మకర్తల బోర్డులోశ్రీనివాస పిళ్ళెగారి నొక ధర్మకర్తగా నియమించరు. ఆబోర్డుకు శ్రీ వెంబాకం రాధవచర్యులుగారు అధ్యక్షులు గా వున్నారు. ఆయన 1812లో చనిపోగా శ్రీనివాసపిళ్ళెగారే అధ్యక్షులై 1852 లో చనిపోయేవరకు ఆపదవిలోవున్నారు. ఝార్జినార్టన్ గారు పేట్రన్ గా వుండి పచ్చయప్పకళాశాల స్థాపనకూ అభివృద్దికీ మూలకారకులలో ఒకరైనారు.

కుంపినీ పరిపాలన ప్రజల స్థితి

1835 వరకూ యీదేశంలో ఇంగ్లీషు విద్య స్థాపింపబడలేదు. ప్రజలలో అజ్ఞానం చాలా వ్యాపించివుంది. కుంపినీవారు కేవలం రాజ్యాక్రమణలోను వ్యాపారంలోను పన్నుల వసూలులోను మునిగి తమ లాభమే ఆలోచించేవారు గాని ప్రజల కష్టసుఖాలను గురించి యోచించేవారు కారు. పూర్వగ్రామ పంచాయరీల పరిపాలన తీసివేసి కలెక్టర్ల పరిపాలన స్థాపించారు. ఈకుంపినీపరిపాలనలో ప్రజలు దరిద్రులై విద్యలేక అజ్ఞానాంధకారంలోను అనారోగ్యంలోను పది ఉండెను, రాకపోకలకు రోడ్లు, పల్లపు సాగుకు సౌకర్యాలు లేకపోవడము, పన్నులూధికంగాఉండి రైతులు భరించలేక పోవడము, పన్నులివ్వలేనివారిని హింసించడము, కలెక్టర్ల నిరంకుశత్వము, అధికారుల లంచగొండితనము కోర్టుల ల్యప్రయోజకత్వము క్రైస్తవ మతబోధకుల విజృంభణములవల్లను ఇంకా ఇతర అన్యాయాల వల్లను ప్రజలు బాధపడుతూవుండేవారు. కొంత ఉదారబుద్ధి గలిగి విధ్యాభివృద్ధి చేయ దలచిన చెన్నపట్నం కాస్తమంచి ప్రయత్నంకూడా ఆగిపోయింది. మనడేశప్రజలకు ఇంగ్లీషు వారిని చూస్తేనేభయం, తమహక్కు- కష్టాలు ఎవరితో చెప్పుకోవాలో ఎలా చెప్పుకోవాలోకూడ తెలియదు. వీరికి దారి చూపించే నాయకులున్నూ లేదు.

హిందూ లిటరరీ సొసైటీ

ఇలాంటి పరిస్థితులలో ప్రజలలో కొంతచైతన్యమూ విజ్ఞానము కలిగించాలని ఏనుగులవారాస్వామయ్యగారు, రాఘ వాచార్యులు గారు, శ్రీనివాస పిళ్ళెగారున్నూ కలిసి జార్జి నార్టను గారి నాయకత్వం కింద చెన్నపట్నంలో హిందూ లిటరరీ సొసైటీ అనే ప్రజాసంఘాన్ని ష్తాపించి సభలుచేసి ఉపన్యాసాలిప్పించి గొప్ప కృషిచేశారు. ఈసభ అదరణకింద దేశ చరిత్రను గురించీ దేశపరిపాలన గురించీ రాజ్యాంగశాస్త్రమును గురించీ ఇంగ్లీషువిద్యావశ్యకతను గురించీ ప్రజల హక్కులను గురించీ నార్టనుగారు 1933-34 మధ్య కొన్నిమహోపన్యాసాలిచ్చారు. అందువల్ల చెన్నపట్నం ప్రజలలో రాజకీయ పరిజ్ఞానంకలిగింది. ప్రజలు ఇంగ్లీషు విద్య కావలెనని కుంపినీవారిని కోరడం ప్రారంచించారు.