పుట:Kasiyatracharitr020670mbp.pdf/190

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏనుగుల వీరాశ్వామయ్య గారి

పెట్తుకొని సముద్రమధ్యే తెచ్చి సముద్రోదకాన్ని పానము చేయుము, నీ క్షుత్తుతీరిన వెనక వివాహము చేసుకుంటానని చెప్పెను. మంచిదని అద్యాపి బడబుడు అగ్నిస్వరూపముగా బడబాగ్ని యనే పేరు పెట్టుకుని సముద్రోదకాన్ని పానముచేస్తూ వున్నాడు.

యీ రీతిగా ఆ రాక్షసుణ్ణి నివృత్తి పొందించి నాకుకూడా సమాప్తి చేయను అశక్యమయిన స్తుతికి పాత్రభూతమైన యీ ప్రయాగను కండ్ల చూదామని సరస్వతి యిక్కడికి వచ్చినది. ఆ సమాచారము గంగా యమునలకు తెలిసి సరస్వతిని ప్రార్ధించి తమతో కూడా యీ స్థలమందు క్రీడింపుచు వుండవలెనని చెప్పినారు. సరస్వతి ధన్యురాల నయితి నని యెంచుకొని వారి ప్రార్షనను అంగీకరించి అయితే నేను ప్రకాశముగా మీతో క్రీడింపుచు నుంటే బ్రహ్మ యేమే సరస్వతి, ప్రయాగ మహాత్మ్య స్తుతిని సమాప్తిచేయక పోతినని నన్ను అడుగును; గనుక గుప్తగామినై మీతో కూడా వుంటానని, అద్యాపి క్రీడింపుచు నున్నది. వారు ముగ్గురున్ను యీరీతిగా యిక్కడ సంగమ మయినందున త్రివేణీ అనే మూడు పాయలుగల జడి అయినారు. ఈత్రివేణికి పయిన వ్రాసిన అక్షయవటమనే వృక్షము కుచ్చుగా ప్రకాశింపుచున్నది. గంగ యమునతో సంగమ మయినది మొదలు లోకుల పాపాలను కత్రించను ఈ రెండునదులు మంచి కత్తెర అనే ఆయుధముగా నున్నా ఆకత్తెరకు నడుమ బిగించే చీల లేకున్నందున బలము తక్కువబడి వుండెను. ఈ సరస్వతి గుప్తముగా ఆ చీల స్థానమును పొంది వున్నందున ఈ మూడునదులున్నూ అది మొదలుగా లోకుల పాపాలను వహించి నదరహి ముగ్గురు స్త్రీలున్ను ఇచ్చట ఒక నదీరూపమున వహించి ప్రవహింపు చున్నారు.

ఇచ్చట క్షౌరము, గోదానము, త్రివేణీదానము, తిలదానము, కించిద్దానమనే ఉపాయ దానమున్ను, ముఖ్యములని చెప్పబడియున్నవి. ధైర్యముచేత ప్రాణదానము ఇచ్చట చేస్తే వాడు జన్మాంతరమందు