పుట:Kasiyatracharitr020670mbp.pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏనుగుల వీరాస్వామయ్య గారి

గంగగుండా అనేక సరకులు కలకత్తా ఢిల్లీ మొదలయిన స్థల ములకు పోతూ వస్తూవుంచున్నవి గనుక ఒంటి కంభం పెద్ద పడవలు చిన్నపడవలున్ను సుమారు 200 వురువులు సదా యీ మిరిజాపురము ఘాటున నిలిచివుంటున్నవి. యక్కడి గంగలో నాల్గు స్నానఘట్టాలు బహుసుందరములుగా కట్టివున్నవి. యీ స్నాన ఘట్టాలలో యీ దేశపు బ్రాహ్మణులు ఘాటు వారనేవారు పందిళ్ళు వేసుకొని స్నానము చేయవచ్చే వారికి సంకల్పము చెప్పి వారి వస్త్రములను కాపాడి, వారు వారు లలాటమందు వుంచుకోల్వడానికి గోపీచందనము స్త్రీలకు సింధూరము మొదలయినవి జాగ్రత్తచేసుకొని కూర్చుండి వుంటారు. యీ దేశస్థులు స్త్రీలు పురుషులున్ను స్నానముచేసి కాగానే మడుగుకు తెచ్చిన వస్త్రముమీద గంగ ప్రోక్షించి లలాట రేఖలు వుంచుకొని ఆఘాటు బ్రాహ్మణుల చేతిలో తాము చేసిన పాపమంతా యిచ్చి వేసినట్తు ఒకదుడ్డు ఒకర్భ పవిత్రముతో కూడా ధారపోస్తారు. ప్రతి దినమున్ను శిరస్నానము చేయని ప్రాణి యీ షహరులో వున్నట్టు నాకు తోచలేదు. బందేఖానాలోవుండే ఖయిదీలుకూడా బంట్రౌతుల కావలితొ వుదయానవచ్చి స్నానము చేసి ఒక గుంపుగా వెళ్ళి పోతారు. విటులుగావుండే స్త్రీలు పురుషులున్ను యెట్లా దేవాలయాలు ప్రబలించి వుండే ద్రావిడదేశములొ దేవాలయాల ఉత్సవ విభనాల సాకుపెట్టుకొని వారి వారికి కలిగిన అలంకారములతో బయట వస్తారో తద్వత్తుగా గంగా స్నాన వ్యాజము పెట్టుకొని యిక్కడి విటులు వుదయాన అగత్యముగా జమ అవుతూ వచ్చుచున్నారు.

ఈ ప్రాంతౌలో స్థలమును శుద్ది చేయవలిస్తే గంగాజలమునే ప్రోక్షించుచున్నాదు. గోమయమును ఆపేక్షింపరు. గంగాజలమును యే జాతి మనిషిచేతనున్నా పరిశుద్ధమని గ్రహింపుచున్నారు. ఇతర జలమును మాత్రము అలాగు గ్రహించరు. ద్ర్రావిడదేశములో మడుగు వస్త్రములను మడి సంచులలో దర్భాసనములలోనున్ను పెట్టుకొని వస్తే పవిత్రము లనుకొని స్నాననంతరము యేలాగు యెత్తి కట్టుచున్నారో అలాగే యిచ్చటివారు మడుగు వస్త్రములను