పుట:Kasiyatracharitr020670mbp.pdf/175

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏనుగుల వీరాస్వామయ్య గారి

క్షత్రియజాతి. వీని రాజ్యము సాలుకు లక్షరూపాయలు యెత్తేది. యితడు రీమారాజుకు సాలుకు 17500 రూపాయిలు కట్టేవాడు. కొన్ని సంవత్సరముల రూకలు కట్టకపోయి బలహీనుడయి నందున రీమారాజు మూడు సంవత్సరములుగా రాజ్యము జప్తు చేసికొని దినానికి 4 రూపాయలు లెక్క యీరాజుకు బత్యఖరుచుకు యిస్తూ వున్నాడు. ఈ వూరు బస్తీ అయినది గనుక సకల పదార్ధాలు దొరుకును. జలవసతి గలది గనుక సుందరమయిన తామరకొలను వొడ్డున డేరాలు వేయించి దిగి యీ రాత్రి పగలున్ను యిక్కడ వసించినాను.

తొమ్మిదవ ప్రకరణము

26 తేది ఉదయాన 4 ఘంటలకు లేచి యిక్కడికి 6 కోసుల దూరములో వుండే హనుమాన్యా అనేవూరు 10 ఘంటలకు చేరినాను. మధ్య నున్న ఊళ్ళు: నెం.18. పటహారా 1.చావోరా 1. కటుకరి 1 - బిజాలి 1-గురుమానది 1. దారి నిన్నటివలెనే సడక్కువేసిన దని పేరు పెట్టుకొని వున్నా యెరుపుదాతు రేగడకలది గనుక మనుష్యులకు నడవడములో కాళ్ళు నిండా గుచ్చుకోలేదు. కొన్ని తావులలో వాగులకు కాలువలకున్ను వారధులు కట్టినారు, గాని మన్నువేసి శాలతో వాటిని సమయముచేసిన వారుకారు. వరిపంట భూమి నిన్నటివలె సారవత్తయినది కాదని తొస్తున్నది. దారిలో వుండే కటుకరి అనెవూరు నిండా బస్తీ అయినది. సకల పదార్దాలున్ను దొరుకును. నేను దిగిన హనుమాన్యా అనే మజిలీ వూరు చిన్నదయినా దుకాణాలు విశాలముగా వున్నవి. డేరాలు వేసి తీసే ప్రయాస లేకుండా వుండును గనుకనున్ను, చెరువుగుంటలు వసతి అయినవి లేనందుననున్ను, దుకాణాలలోనే దిగినాను. డాకు చౌకీ హరకారాల కుమ్మక్కువల్ల అన్ని పదార్దాలున్ను దొరికినవి.

మైహరు మొదలుగా నేనుమజిలీ చేసె ప్రతివూళ్ళోనున్ను జ్వరాలతో శానామంది హింసపడు చునున్నారు. నాసోబతు కోరి వచ్చేవారికి అదే గతిగా వున్నది. నా పరివారజనము సుమారు నూరుమంది. వీరిలో