పుట:Kasiyatracharitr020670mbp.pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కాశీయూఅత్ర చరిత్ర

24 తేది ఉదయాన 4 ఘంటలకు లేచి యిక్కడికి 5 కోసుల దూరములోవుండే సత్తిని అనేవూరు 10 ఘంటలకు చేరినాను. మధ్యనున్న యూళ్ళు; నెం - 16 - మనగాం - 1 - సత్తిని -1.దారినిన్నటివలెనే అనుకూలముగా వుండలేదు. కొండల యడివి కొన్ని దినములుగా ఉపద్రవపెట్టడములేదు. యీ దినము 10 వాగులదాకా దాటినాను. ఆవాగులుదిగి యెక్కడానికి వయిపుగా (వీలుగా) రాళ్ళతో కట్టివుండలేదు. దారిలో మనగాం అనే వూరికి సమీపముగా ఒక వాగువద్ద ఒక మనిషిని చంపి పడవేసివున్నది. నాతోకూడా వచ్చే తపాలు మనుష్యులు కుంఫిణీ వారి యాజ్ఞ యీప్రాంతములలో కలిగిన వెనుక సడక్కమీద యిట్లా ఘాతలు నడవలేదు. యిప్పు డేమో ఆరంభ మయినదని వ్యసనపడు కొన్నారు. రీమాలో ఒక మనిషి జబ్బల్ పూరు యెజంటు రీమా అకుబర్లు (సమాచారములు) వ్రాస్తూ మిరిజాపురము వరకు తపాలు హరకారాల విచారణకూడా చేస్తూవున్నాడు. అతనితో స్నేహము చేసుకొని మిరిజాపురము దాకా తపాలు మనుష్యులు కూడావచ్చేటట్టు చేసుకొన్నాను. యీ వూరిలో ఈ రాత్రి పగలున్నూ వసించడ మయినది. అన్ని పదార్ధాలు దొరికినవి. చిన్న వూరు. జలవసతి కద్దు. గుంటగట్టున డేరాలు ఫేయించినాను.

25 తేది ఉదయాన 4 ఘంటలకు లేచి యిక్కడికి 4 కోసుల దూరములో వుండే మౌగంజు అనె వూరు 9 ఘంటలకు చేరినాను. మధ్యనున్న ఊళ్ళు నెం.17. లవరుటిలావు 1- మాగంజు -1-దారి నిన్నటివలెనే వున్నది. శిలానాలా అనే వాగు ఒకటి దాటవలసినది. యింకా కొన్ని వాగులు దాటవలెను. శిలానాలా మొదలుగా శాలగా దారికి యిరుపక్కల కొన్ని చెట్లు పెట్టి వున్నవి. నిన్నటి మజిలీ మొదలుగా భూమి చెన్నపట్టణము చుట్టూవుండే భూమివలెనే కలిమెడుచల్లితే తూమెడు పండే పాటి చవుడు కలిసిన రేగడగా వున్నది. అందుకు తగ్గట్టే యీ భూమి నివాసస్థులు పందిళ్ళు చెక్కిళ్ళు చిక్కి స్వల్పగాత్రులుయి వున్నారు. యీ మౌగంజు అనే వూరు మౌగంజు రాజు రాజధాని. యిప్పటి రాజు పేరు అనిరుద్ధసింగు. సెంగెరు అనే