పుట:Kasiyatracharitr020670mbp.pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏనుగుల వీరాస్వామయ్య గారి

డము మాని ఉపచరించేవారు ఉండే మహాస్థళానికే చెన్నపట్టణపు శెట్లు తిరువట్టూరికిన్ని కోమట్లు తిరువల్లిక్కేణికిన్ని మొదలారులు మయిలాపూరికిన్ని వెళ్ళేటట్టు పోవుచు నుంటారు గాని ఒకపూట అన్నము తమ ప్రయాసతొ జాగ్రత్త పెట్టుకొనేపాటి ధైర్యముతో ఇతర స్థళాలకు వెళ్ళడములేదు. ఉత్తర దేశస్థులు సహజముగా తీర్ధయాత్రలకు అక్కడ యెక్కువ విభవాలు జరగకపోయినా యెరిగిన వారు యెవరున్ను లేకపోయినా బహుదూరానికి వెళ్ళుచున్నారు. మళయాళదేశాస్థులు సేతుయాత్ర వెళ్ళవలిస్తే వర్ త్త్ కొట్టి యమణల్ వెళ్ళీ కట్టియముళ్ దారిలో వున్నదని అద్యాపి జడుస్తారు. హిందూస్థాని దేశస్థులు మనోభీష్టాలు యీడేరవలిస్తే అనాయాసముగా గంగోత్తరి మొదలయిన పంచగంగ కావిళ్ళు తెచ్చి దాతా వైద్యనాధ స్వామికి అభిషేకము చేస్తూవస్తున్నారు.

ఆహారములు, స్త్రీ సంగమాలున్ను, దృఢతరముగ్తా చేసి ఉత్తర దేశాస్థులవలె దాక్షిణాత్యులు తృప్తిపొంది వాటివల్ల వెంబడిగానే విరామాన్ని పొందకపోయినా దాక్షిణాత్యులు దినానికి నాలు గవసరాలుగా భోజనముచేసి మధ్యే మధ్యే మజ్జిగె తేట మొదలైన పానీయాలు పుచ్చుకొని చూచిన భక్ష్య యోగ్య స్వల్ప పదార్ధాల నంతా చూచినప్పుడంతా తినకోరుచున్నారు. స్త్రీ సంగమాదులలో నున్ను అదేరీతిగా మనస్సున నిబ్బరముతో దేహధర్మాన్ని వుంచనేరక ధృఢముగా భోగించలేకపోయినా, చూచిన మిణుకుకత్తెల పయినంతా దృష్టిని పోనిచ్చి సంగమాదులలో అనేకావృత్తులు ప్రవర్తింపు చున్నారు. అందువల్లనే ఆ దేశస్థులకు త్వరగా వీర్యనష్టమయి అండవాయురోగము కల్గుచు వచ్చుచున్న దని యింగిలీషువారు తాత్పర్యము గలవారై వున్నారు. ఈ చాపల్యాలకంతా కారణము పిత్తోద్రేకమని తోచుచున్నది. యీపిత్తోపరి కావడానికి ఉష్ణమే కారణముగాని వేరేలేదు వాతము రజోగుణధాతువు; పిత్తము తమోగుణధాతువు; శ్లేష్మము శీతభూమిలో ప్రకోపమవుచున్నది; వాతము ఉభయమధ్యస్థముగా ఇతరములయిన రెండు ధాతు