పుట:Kasiyatracharitr020670mbp.pdf/164

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


కాశీయాత్ర చరిత్ర

ఉత్తరములోనున్ను వుండే భేదములు తెలియును ఇంకా యీ అడుగున వ్రాయుచున్నాను. తంజావూరు తిన్నెవల్లి సీమవారు 'గాయికి వందనం తగప్పన్ 'అనేవాక్యాన్ని వాడుచు ఊరికి వచ్చిన అధికారస్థుడు ఏమిచేసినా అంగీకరింపుచున్నారు. హయిదరాబాదు నాగపూరు రాజ్యములలో భిక్షకుణ్ని ఒక ముసాఫరులు దిగే స్థలములో నుంచి నాలుగు గడియలు అవతలికి లేచిపోయి ఉండుమంటే తనకు చేసిన ఆజ్ఞ న్యాయ విరుద్దము గనుక నా తలకాయ కొట్టిన వెనక నా కళేబరాన్ని యీస్థలములో నుంచి వొత్తించ వలసినదిగాని నేనుగా భయపడి లేవనని సర్వాధికారము కలవారిని నిగ్రహించి చెప్పుతాడు. దక్షిణదేశస్థులకు బెత్తపు దెబ్బపుట్టించే నొప్పి, కలగచేసే భయము ఉత్తరదేశాస్థులకు తల తెగడములో లేకుండా వున్నది. అయితే దక్షిణదేశస్థుల భయము భక్తిజన్యము కాదు గనుక నిలకడగా వుండేదిలేదు. ఉత్తర దేశస్థులు భయప్రేరణ లేకుండానే చేతనయి నంత మట్టుకు న్యాయముగా నటింపుచు వచ్చుచున్నారు. తమ తాత్పర్యము యెదటివారి తాత్పర్యముతో భేదించినప్పుడు పురుషవాహిని ప్రకారము అహంకారాన్ని వృద్ధిపొందించి నటింపుచున్నారు. యిటు నంటి మనోబుద్ధి హయంకారమాలు స్థూలదేహముతొ నెయ్యిపాలలొ కలసినట్టు వున్నందున బౌద్ధులు నెయ్యిని పాలలోనుంచి విడతీసే ప్రయాస పుచ్చుకోచాలక పాలనే నెయ్యి అని భావించినట్తు స్థూలదేహాన్నే పరబ్రహ్మ అని భావింపుచున్నారు. అటువంటి భావనకూడా ప్రత్య వాయమయినది కాదని తొచుచున్నది. కొండకొనకు పోవలస్తే మెట్టు మెట్టుగా యెక్కిపోవలసినది గనుక ఒకరు ఒకదారిగా మరియొకరు మరియొక దారిగా యెక్కుచున్నారు. యేరీతిగా నయినా ఏపదార్ధమందయినా పరబ్రహ్మను నిరూపించి ఆరాధనచేసి కడతేరవలసినది గనుక సర్వం విష్ణుమయం జగత్ అనే న్యాయప్రకారము యేవస్తువును యే నామ రూపాలతొ పరబ్రహ్మగా నిరూపించినా బాధకము గాదు. దాక్షిణాత్యులకు అతి సమీపములో అనేక దేవాలయాలు అతివిభవముతో ఉత్సవాలు జరిగేవిగా వుండిన్ని తమకు భోజనమజ్ఞ నాదులు ఉపచదించేవారు అక్కడలేని పక్షమందు ఆస్థలానికి వెళ్ళ