పుట:Kasiyatracharitr020670mbp.pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏనుగుల వీరాస్వామయ్యగారి

అడుగడుకు విశేష ద్రవ్యవ్రయముచేత సృష్టించవలసిన అగత్యము లేదని ఉత్తరదేశపు పూర్వీకులైన ఉత్కృష్ణులు నియమించినవారు కారు; కాని ఒకవేళ శాస్త్రవిచారాణచేసి అందువల్ల భక్తి మాత్రము సంపాదించడము కూడా అందరికి సాధ్యము కాదని ఊహించినవారై యిక్కడి మూఢులు తరింఛే నిమిత్తమై యీ ఉత్తరదేశములో నున్ను యధోచితమైన ద్రవ్యవ్రయముతో బహు దూరానికి బహుదూరమున ఒక్కొక్క నదియందు ఒక్కొక్క మహాత్మ్యము నిర్ణయముచేసి ఆనదీ తీరమందు కొద్ది అయిన దేవాలయాలు నిర్మింఛేటట్టుచేసి వాటిలోని బింబాలకు యధోచితమయిన పూజలు ఉపాయముగా జరిగించేటట్టు చేసినారు. గనుక అందువల్ల యీ శీతదేశపు మూఢులు కొంతదూరము కాయాన్ని క్లేశపెట్టి దేశ సంచారము చేయడానికి సమర్ధులు గనుక ఆ ప్రకారమే ఛేసి అట్టి నదులలో స్నానముచేసి అట్టి దేవాలయాలలోని బింబాలను ఆరాధించి కడతేరుచు వచ్చుచున్నారని తొచుచున్నది. అయితే మూఢవ్యతిరిక్తులుగా వుండే వారు ఈ నదుల స్నానాలున్ను చేయ నక్కర లేదే అని శంఖ తోచును. మూడ వ్వతిరిక్తులకు శాస్త్రమువల్ల కలిగే తెలివి పై పాచిని తొసిన జలమువంటిది గనుకనున్ను మళ్ళీ మూఢత్వము పాచివలెనే కమ్ముచూ వచ్చును గనుకనున్ను మూఢవ్యతిరిక్తులు మూఢుల అనే క్షయా పెద్దలు గనుకనున్ను మూఢులకు గతి కల్పించవలసినది మూఢ వ్యతిరుక్తులకు మిక్కిలి అగత్య మయినందుననున్ను తృణము మొదలు మేరువు వరకు పరబ్రహ్మచైతన్యము నిండి ఉన్నదనే నిశ్చయముతో పూర్వీకులైన పెద్దలు వ్రాసిన నిమిత్తములను బట్టి యేర్పరచి వుండేస్థలముల నేమి బింబాలనేమి తీర్ధాలనేమి వారి సంకేతానికి యెంత మాత్రమున్ను భంగము రాకుండా భక్తితో మూఢ వ్యతిరిక్తులున్ను ఆరాధింపుచు రావలసినది. తద్ద్వారా "యాదృశీభావనా, యత్ర సిద్ధిర్భవతి తాదృశీ" అనే సత్యవాక్యప్రకారము మూఢులను మూఢ వ్యతిరిక్తులనున్ను తరింపచేయుచు వచ్చుచున్నది.

ధైర్య స్థైర్యాలకు నెల్లూరికి దక్షిణములోనున్ను నెల్లూరికి