పుట:Kasiyatracharitr020670mbp.pdf/162

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


కాశీయాత్ర చరిత్ర

నుజాచార్యులు ఆళ్వారాదులు అప్పర సుందర మాణిక్యవాసులు మొదలయిన వారిగుండా ఆ దేశపు 'యద్వద్విబూతి మత్సత్వం' అనే సాటిరాజులగుండానున్ను ధనికులగుండానున్ను వారున్న భూమిలో వూరూరికి సమీప వత్రిగా ఒక్కొక్క ప్రదేశాన్ని పుణ్యభూమియని యేర్పరచి ఆ ప్రదేశాలలో మనుష్యుల భక్తిని ఆకర్షింఛేపాటి దేవాలయాలను బహు ద్రవ్యవ్వయముతో అమానుష కృత్యముగా వుండే టట్టు కట్టించి అందులో బింబాలకు మంత్రమూలకముగా మహత్యమును కలుగజేసి ఆ బింబాలకి చేసే రాజోపచారములు మొదలయిన ఆరారాధనలు యీ చాంచల్యము కలిగిన జనులకు సుఖకరములుగానున్ను ఉత్సాహకరములుగా నున్ను ఆపేక్షితములుగానున్ను వుండేటట్టుచేసి యీ సుఖాపేక్షగుండానయినా అట్టిదేవాలయాలకు మనుష్యులుపోవుచు ఉపచరింపుచు అక్కడక్కడి విభవాలను ధనవ్రయము గుండా వృద్ధిపొందింప చేయుచురాగా వారికి ఒక భక్తిజనితమై తరించడానకు హేతువు అయివుంటున్నదని చేసినాడు. ఉత్తరదేశమున 14 నోల్ల్ భాగమొదలు సుమారి 30 యేభాగపర్యంతము వసింఛేవారు, తత్పూర్వ దేశాస్థుల ఆపేక్షయా వుష్ణశల్మనమైన భూమిలో వశించేవారు గనుక నెల్లూరు మొదలుగా ఢిల్లీపర్యంతము వుండేవారికి జాఠరాగ్ని క్రమక్రమముగా పటుత్వముకలిగి వుండేటందున రొట్టె, నెయ్యి, పాలు, దూదుఫేడాలు పప్పు చక్కెర ఘనీభవించిన పెరుగు మొదలయిన దీఘ్రముగా జీర్ణము కాదగ్గ బలమయిన ఆహారాదులు పుచ్చుకొనుచున్నారు. తద్ధ్వారా హృత్కమలము యధోచితమయిన దృఢభావాన్ని పొంది ఉష్ణదేశస్థుల ఆపేక్షయా ధైర్యస్థైర్యాలు యెక్కువ కలవారై దేశాతనము చేయడానకున్ను గురుకుల వాసముచేసి శాస్త్రవిచారణ చేయునున్ను సామర్ధ్యము కలవారై యున్నారు. గనుక శాస్త్ర విచారణద్వారా జ్ఞానము ఉదయించక పోయినా భక్తి మాత్రము సహజముగా ఈశ్వరునిపట్ల ఉదయించ వచ్చును గనుక మూఢులకు ఉత్సాహాకరములైన నృత్యవాద్యగీతాలు రుచికరములయిన ప్రసాద తీర్ధాలున్ను లభ్యములు కాగల దేవాలయాలు ఉత్తర దేశములో