పుట:Kasiyatracharitr020670mbp.pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏనుగుల వీరాస్వామయ్య గారి

భ్రాంహ్మణ పరిజనానికి చాలేటట్టు జబ్బల్ పూవు బస్తీలో సంపాదించి బియ్యముతోకూడా రెండు బాడిగె గుర్రాలమీద గుర్రము 1 కి 10 నాగపూరి రూపాయలవంతున కాశికి బాడిగ మాట్లాడి యేర్పరచి తీసుకొని వచ్చినాను. ఈ యూరిలో ఈ రాత్రి నిలిచినాను.

14 తేది ఉదయముయిన 4 ఘంటలకు లేచి యిక్కడికి 8 కోసుల దూరములో నుండే సలమాబాదు అనే ఊరు రెండు ఘంటలకు చేరినాను. నడిమిఊళ్ళు: నెం|| 10 బజారి - 1 - మహీరా- హోందన్నయనది - సోమిరిల్యా 1 - పరవా - శిహోరా 1 - క్మానం రేవరా - మోహలా - 1 - ధనుగ్రా - 1 - చప్రా - 1 - సలమాబాదు 1. బోయీలు యీదినము యెండగొట్తు పడినందున చప్రా అనే వూరివద్ద వారు వంటచేసుకొని భోజనముచేసి వచ్చే దాకా నాలుగు గడియలు నిల్వడమయినది గనుక మజిలీ చేరడానికి ఇంత ప్రొద్దు పోయినది. దారి నిన్నటివలె సౌఖ్యప్రదముగా శాలవేసి యున్నది. దారిలో హోరాఅనే యూరు బహు గొప్ప కసుబా, బస్తీ అయినది. సుందర మయిన మామిడితొపులు గుంటలు చెర్వులు చిన్న దేవాలయాలు జప మంటపాలున్ను కలిగి యున్నది. యీ యూరివరకు అడివిలేదు, ఫెల్లడిగా నున్నది. పైరుభూమి, దానికి ఇవతలి మజిలీ యయిన సలమాబాదు వరకు దారికి యిరుపక్కలా తేలికె యయిన అడివి కలిగి యున్నది. జబ్బల్ పూరు మొదలుగా ఈమజిలీ యూరివరకు భాట కిరుపక్కలా దూరములో చిన్న కొండలు కనుపడుచువచ్చుచున్నవి. యీ సలమాబాదులో ఉన్నట్టు ఈయూరిలోనున్ను ఒక కొత్తవాలు ఉన్నాడు. సకలపదార్దాలున్ను దొరుకును.

ఈఆచార నియమములు మనోబంధహేతుకము లనిన్ని "అభావే విరక్తి" అనే సత్యవచన ప్రకారము సాగని పక్షమందు ఆ నియమాలమీద విరక్తి పుట్టగలదని యనడానకు ఒక దృష్టాంత మే మంటే, మేము చెన్నపట్టణమూ వదలి వచ్చిన వెనక హైదరాబాదుకు ఇవతల నుండే మల్లుపేట అనే ఊరివరకు బ్రాంహ్మణయిండ్లు వుండి కష్టపడితే