పుట:Kasiyatracharitr020670mbp.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కాశీయాత్ర చరిత్ర

దారి యిక్కడ పరంగి కొండకు* పొయ్యేమార్గమువలె సడక్కు అనే ఘట్టనవేసి యిరు పక్కలా మామిడి చెట్లు అశ్వద్ధాలు శాల@ వేసియున్నది. ఆ చెట్లు చూడగా వేసి యాడాది అయినట్టు తోచుచున్నది. దారి వెల్లిడిగా యిరుపక్కల తోపులతో వరిపయిరులతో శృంగారముగా ఉన్నది. చిన్న వాగులకు వారధులు కట్టినారు. పెద్దవాగులకు కల్లుగాళ్ళతో ఇనపమేకులు బిగించి దారిని కోయకుండా యెక్కి దిగడానికి సులువుగా మెట్లు కట్టియున్నవి. యీచెట్లు శాలపెద్దగాపెరిగితే సూర్యరశ్మిపయిన పడదు. గుర్రపుబండ్లు వేడుకగా నడిచి పోవచ్చును. ఈ దారులనున్ను శాలవృక్షాలనున్ను కాపాడడానికి రీమా అనే యూరిలో ఒక దొరను తగుపాటి సిబ్బందితో మార్గ విచారణకర్త హోదా కలగచేసి ఉంచియున్నారు. ఈ దారుల విషయమై బంగాళా గౌవర్ మెంటువారు చేసే వ్రయాణానికి ఈశ్వరుడు సంతొషించునని తొచుచున్నది. దారిలో పెన్నగరు అనే వూరికి ముందు ఒక పెద్దనది దాటవలసినది. యిక్కడ 2 దోనెలు ఉన్నవిగాని నాకు కాలునడకగానే యుండను. పెన్నగరుకు ఇవతల ఒక పెద్ద వాగు దాటవలచినది.

ఈ గోసలపూరు పెద్దది. దుకాణాలు కొట్టాయిలున్ను కట్టి యున్నారు. అవి వసతివికావు గనుక వూరికి సమీపాన నుండే ఒక కొలను వొడ్డున డేరాలు వేసుకొని దిగినాను. అది రమణీయమయిన జలము గలది; ఫలవృక్షాలతోనున్ను అవరింపబడియున్నది. ఒక గొసాయి యిక్కడ శివప్రతిష్టచేసి కొన్ని మంటపాలు కట్టినాడు. అందులొ కొన్ని నూతన సృష్టములయినా యీశ్వరాజ్ఞ చేత శిధిలములయియున్నవి. యీరిలో సకల సకల పరార్ధాలున్ను పుష్కలముగా దొరుకును. చింతపండు మిరపకాయ యీ రెండు వస్తువులున్ను బహు ప్రయత్రముమీద కాశీ పర్యంతము దారిలో నా


  • పరంగికొండ అనగా చెన్నపట్నంలో సెంట్ తామస్ మౌంటు. దీనికి పోయే రాజబాటకే మౌంటురోడ్డు అని పేరు. ఆ కాలానికే ఇది చాలా అందముగా ఉండేది.

@శాలవేసి యున్నదనగా నీడకోసం రోడ్దుకు రెండు పక్కలా చెట్లువరుసగా వేయబడనవని అర్ధం.