పుట:Kasiyatracharitr020670mbp.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏనుగుల వీరాస్వామయ్యగారి

ఇక్కడ గౌనర్ జనరల్ యేజెంటువుండే స్థలము గనుక హాజూరనిపించుకొని చుట్టుపక్కలావుండే మైహరు రాజు రీమారాజు సాగరారాజు మొదలయిన వారి వకీళ్ళు కాచుకొని యున్నారు. అక్కడక్కడి తాలూకాలు విచారణచేసే ప్రి స్ పాల్ అసిష్టాంటునులు, జడ్జీ అధికారముకూడా జరిగింపుచున్నరు గనుక నున్ను వారి తీర్పులమీద యేజేంటుకు అప్పీలు చేయవచ్చును గనుక నున్ను చుట్టుపక్కల ఉండే అనేక రహితులతోను ఈబస్తీ నిండియున్నది. కాకరు ప్రసాదు అనే సాహుకారు ఒకడు కానుపూరు కాపురస్తుడు ఇక్కడ వసింది సాహుకారు పనులు జరిగింపు చున్నాడు. యేజంటు అయిన స్మిత్తు దొరగారు అత్యున్నతమయిన మొగలాయి సంతనతో దాపుకలిగిఉన్నా నాపట్ల శ్రీరాముల కటాక్షముచేత ఫరవానా ఒకటి దారిలో నాకు సకలక్షేమములున్ను కలిగేకొరకు హయిదరాబాదు కర్నల్ నాగపూరు మేస్తర్ గ్రీందొరవలెనే వ్రాశియిచ్చి కాశివరకుకూడా వచ్చేటట్టుగా చప్పరాశి అనే బిళ్ళబంట్రోతును ఒకని తయినాతి చేసినారు.* యీ జబ్బల్ పూరు చేరేవరకు నాతొగూడా వచ్చినవారందరున్ను సురక్షిరముగా ఉన్నా యిక్కడ చేరిన రెండు మూడుదినములకు వారిలో నలుగు రయిదుగురకి అడివి గడిచివచ్చినా తత్సంబంధ మయిన చలిజ్వరాలు తగిలినవి. యీ యూరిలో చిన్నపడుచులను కొందరిని తెఛ్ఛి అమ్మేటట్టువిన్నాను. యీ బస్తీలో 12 తేదీదాకా నిలిచినాను.

13 తేదీ ఉదయమైన 3.4 ఘంటకు లేచి ఇక్కడికి 6 కోసుల దూరములో వుండే గోసలపూరు అనేవూరు 10 గంటలకు చేరినాను. మధ్యనున్న ఊళ్ళు; నెం.9 కొట్రా 1 సహాగి 1 వరియెడునది 1 సన్నగరు 1 రేవురా 1 కూసుమీరు 1 బాడాగల్ 1 గోసలపూరు 1.


  • జబ్బల్ పూరులొ తాలూకా ప్రించిపాల్ అసిస్తాంటు అయిన కర్నల్ స్లీమన్ గారు శిఫారసు ఉత్తారా లిచ్చి కాశీవరకు చప్రాసీనిచ్చి పంపినారని వ్రాత ప్రతి 133 పుటలో నున్నది. ఈ స్లీమన్ గారు తరువాత హిందూదేశాన్ని గురించి అనేక గ్రంధాలు వ్రాశారు.