పుట:Kasiyatracharitr020670mbp.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏనుగుల వీరాస్వామయ్య గారి

వదిలి భృగుమహాముని సమీపముగా వచ్చి ప్రవహించినది. పూర్వము ప్రవహించి మళ్ళినచోటుకువరకు ఇప్పటికిన్ని బెడాఘాటువద్ద నవనీతము వంటి తెలుపు నునుపు వర్ణములతో భూమియావత్తున్ను శిలామయమయి యున్నది. ఆ శిలను ఇక్కడి దేవస్థళాలలో ప్రతిమలుగాచేసి యుంచుచున్నారు. నర్మదాలింగాలు తెచ్చి అమ్మే గొసాయీలు ఈశిలలతో కోడిగుడ్డుచందముగా లింగాలుచేయించి స్యయంభువులని దేశాంతరాలలో అమ్ముచున్నారు. మెట్టుకు వీరు ఎంత కృత్రిమముచేసినా నర్మదశిలలు శివస్వరూపాలు అనేమాట సత్యము గనుక ఆ లింగాలను అరాధనచేసేవారికీ అభ్యుదయమే కలుగును.

ఈకొండరాజు అపారమయిన ధనముగలవాడు గనుక అజేయుడుగా నుండినాడు. ఆరాజు వేసుకొన్న నవరత్నఖచితమయిన పాపాను (పాపోసు) ఒకటి ఇపుడు సాగరరాజు సంస్థానములో నున్నది. దాని వెల నిశ్చయించను ఇప్పటికిన్ని అశక్యముగా నున్నది. యిట్లావుండగా గోవిందపంతులు, గంగాధరబావా, బాలాజీబావా అనే కరాడి బ్ర్రాంహ్మణులు ముగ్గురున్ను పరస్పర రక్తసంబంధము గలవారు; వారు పునా శ్రీమంతుని ఆజ్ఞను ధరించిన సరదారులు. వారు నర్మదానదిని అనేక సహస్ర సువర్ణపుష్పములతో ఆరాధించి ఆ నదికటాక్షము సంపాదించి దాన్ని కాలినడకతొనే దాటి ఘర్డామండలంజిల్లా తీసుకొని కొండరాజును పట్టుకొన్నారు. ఆ కొండరాజు తాను పట్టుబడకమునుపే తన ద్రవ్యమంతా ఆ నర్మదకు ప్రీతిగా అందులోవేసి పగవారికి లభించకుండా చేసినాడు. ఆ ముగ్గురు సరదారులున్ను సాగరాయనే యూరును తమకు రాజధానిగా చేసుకొని అబ్బాసాహెబు అనే తమ వంశస్థునికి ఈ రాజ్య్హమిచ్చి తమ్ము నాశ్రయించియుండిన ఆంధ్రదేశపు బ్రాంహ్మణులకు తిలవారాఘాటు మొదలయిన స్థలములలో పుష్కలమయిన జీవనాలు కలగచేసి అక్కడి కాపురస్తులుగా చేసినారు. ఆ అబ్బాసాహెబు రవంత మెత్తని వాడయినందున కొన్ని సమయములలో తమ క్షాత్రధర్మము చేత పునాశ్రీమంతుని సంతొషపెట్టి యీ నర్మద సమీపప్రతి అయిన యీజబ్బల్పూరుతొ చేరిన భూమిని నాగపూరు