పుట:Kasiyatracharitr020670mbp.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చున్నది. చింతకాయ తొక్కుకు నేను ఆవనూనె పోయించినంతలో అతి రుచికరముగా నున్నది. ఈయూరిలో 8 తేది మధ్యాహ్నపర్యంతము వుంటిని.

ఏడవ ప్రకరణము

8 తేది మధ్యాహ్నముమీద 3-4 ఘంటకు బయిలుదేరి యిక్కడికి 3 కోసుల దూరములోనుండే జబ్బల్ పూరు అనే షహరు ప్రవేశించినాను. దారి బాగా ఘట్టనచేసి కాలువలకు వరధులు కట్టియున్నవి. దారికి ఇంరుపక్కలా దూరాన చిన్న కొండ లున్నవి. చిన్న యీ గుళ్ళు, బావులు, గుంటలున్ను కొన్ని దారికి ఇరుపక్కలా కట్టి యున్నవి. యీ గుళ్ళూ స్తూపీలు చెరిసగానికి పగలగొట్టిన శిగ గల టెంకాయ చందముగా కట్టియున్నవి.

యీ జబ్బల్ పూరు అనే షహరు లోగ డిదినములలో యధోచిత మయిన కసుభాస్థళము. ఘర్డామండల మనే రాజధాని కింద నుందినది. ఆ రాజధాని నిజాంషాహు అనే కొండరాజుది. షుమారు 20 ఏండ్ల కిందట పూనా శ్రీమంతుడు భోసల వంశస్థులు సాధించిన రాజ్యములు గాక ఇంకా కొండరాజుల కిందనుండే ఘర్డామండలము మొదలయిన రాజ్యములను తియ్యవలెనని సర్వ ప్రయత్నమున్ను అప్పుడప్పుడు చేస్తూ వచ్చినందున బ్ర్రాంహ్మణ జాతిమీద ఒక ద్వేషము ఈకొండరాజుకు జనించి బ్ర్రాంహ్మణులని తన రాజ్యములో కనుపడ్డ వారి నంతా సంహరింపుచు వచ్చినాడు. ఈ నిజాంషాహు రాజును సాధించడము పురాశ్రీమంతునికి ప్రయాసగా నుంచు వచ్చినది.

ఆ కొండరాజుకు రాజధాని యయిన ఘర్డామండల షహరును చుట్టు కొని నర్మదానది ప్రవహింపుచు వున్నది. యీనది మహాత్మ్యమేమంటే గతకాలములో భృగు మహాముని యీ ప్రాంతమున తపస్సు చేయుచు నుండగా నది అతనికి కొంత దూరములో ప్రవహించినది. భృగుమహాముని నా సమీపముగా వచ్చిప్రవహించక వరగడగా పోవలసినదేమని మనసులో నొచ్చుకొన్నంతలో తత్పూర్వపు ప్రవాహమును