పుట:Kasiyatracharitr020670mbp.pdf/140

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ఏనుగుల వీరాస్వామయ్య గారి

ఎండు కొబ్బెరలోపల నుండే టెంకాయలు దొరుకుచున్నవి. యీ ప్రాంతములలో ఉప్పుడు బియ్యము, చింతపండున్ను ప్రియమయినా కావలసినది దొరుకును. రాతిఉప్పు విశేషముగా అమ్ముతారు. ఈయూరినుంచి శిమినీ అనే యూరిలో కేప్టన్ వాడున్ లో దొర వద్ద ముఖ్యుడుగా నుండేఋ బంగాళీ బ్రాంహ్మణుడయిన బాలకిసన్ బాబు అనే వానికి ఒక యుపచార మయిన యింగిలీషు జాబు వ్రాసి నా తయినాతిగా నర్మదవరకు ఒక బిళ్ళ బంట్రౌతున్ను, ఒక టప్పామనిషిన్ని మజిలీల ప్రకారము కూడావచ్చేటట్టు శ్రీరామ కటాక్షముచేత ఉత్తరువు తెప్పించుకొన్నాను. చావడి అనే ఊరు గొప్పది. ఆ రాత్రి అక్కడ వసించినాను.

శప్టెంబరు నెల 1 తేది ఉదయాన 3 ఘంటలకు లేచి యేడు కోసుల దూరములో నుండే నారాయణగంజు అనే ఊరు 12 ఘంటలకు చేరినాను. నడిమివూళ్ళు, నెంబరు 4. పిండిరి. 1 - లక్కుగోవాడ. 1. శింగపూరు 1. హోరా 1. చౌకి, 1. నారిల్లి, 1. గంటియా, 1 నారాయణ గంజు 1.

దారిలో అదివి లేకపోయినా బహుశా నల్ల రేగడ. శానా పశ్చిమ వాహిను లయిన వాగులను దాటవలెను. కొంత దూరము రాతిగొట్టుగా నున్నది. యీ యూరు యడారిమధ్యే ఉన్నది. దుకాణపు దారులు పేదలు గనుక పనిగడుపుకొనే పాటిగా కొట్టాయిలు కట్టియున్నారు. ముసాఫరులకు కావలసిన సామానులు ఒక్కటిన్ని తక్కువ లేక దొరుకును. చెరువు కలదు. జలవసతి అయిన గ్రామ మేను. ఇక్కడ యీరాత్రి నిలిచినాను.

2 తేది ఉదయాన 5 ఘంటలకు లేచి 8 కోసుల దూరములో నుండే గణెశగంజు అనే ఊరు చేరినాను. నడిమి వూళ్ళు. నెంబరు 5. బండోలు - 1 - సాదక్కునూని -1- చప్పారా -1- గనికెతాలు - 1- కుయ్యో - 1- గణేశగంజు -1.

ఆవూరు కొండ కిందనున్నది. దారిలో చప్పారా అనే కనుబాబస్తి యూరివద్ద భానుగంగా అనే నది దాటవలసినది. చప్పారా అనే యూరి వరకు భాట నల్లరేగడ, రాతిగొట్టు. ఆయూరికి ఇవతల కొండలు