పుట:Kasiyatracharitr020670mbp.pdf/138

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏనుగుల వీరాస్వామయ్యగారి

ఈరామటెంకికి ఉత్తరము బంగాళా గౌనరుమెంటులో చేరిన శిమిని తాలూకాతో చేరినిది. ఈ రాజ్యము కుంఫిణీవారికి స్వాధీన మయిన వెనక గవనర్ జనరలువారు జబ్బలపురిలో ఒక ఏజంటును సాగరులో ఒక ఏజంటునున్ను ఉంచి వారికింద కొందరిని ప్రింసైపాలు అసిస్తాంట్సు అని యేడుగురు దొరలను ఏర్పరచినారు. ఇంగిలీషువారి ఆధీనముగా ఈరాజ్యము కాక మునుపు యీ యడవిలలో దొంగలభయము విస్తారముగనుక ఇప్పుడు ఊరికి మూడేసి గుర్రపుసాలాలను ఠాణాలుగా ఉంచి బహుమమందిని పట్టి శిక్షించి కొందరిని దారులలో తూకుతీసి(ఉరితీసి) ఆ కళెబరాలు శిధిలము లయ్యే దాకా వ్రేలుకాడుచు నుండేటట్టు చేసినారు. మజిలీ యూళ్ళలో పరువుకల ముసాఫరులు సరఫరా నిమిత్తము ఒకకొత్తవాలునున్ను యిద్దరేసి సరఫరా బంట్రౌతులునున్ను ఉంచియున్నారు. ఇప్పట్లో మృగ భయము ఒంటిగా వఛ్ఛేవారికి మాత్రము ఉండవచ్చును.

యీ దొంగల తాళవు అనే యూరు బహు జలవసతి కలది, దొంగలు వేసేతళావు కలది గనుక దొంగలతళావు అని పేరువచ్చినది. యీ శిమినీ తాలూకా కిందవుండే గ్రామాలు యిజారాలకు తీర్చియిచ్చినారు. ఆ యిజారాదారులను పట్టేలు అని వాడు కొనుచున్నారు. యీ యూరు చిన్నదయినా ముసాఫరులకు సౌఖ్యప్రదముగా నున్నది. ఆ రాత్రి అక్కడ వసించినాను. మోది అనేఊరు ఒకటి దారిలోనున్నది. అక్కడ నాగపూరు రాజు చౌకీ ఒకటియున్నది.

30 తేది ఉదయాన 6.4 ఘంటకు లేచి యిక్కడికి 7 కోసుల దూరములో నుండే కురాయి అనేవూరు 1 ఘంటకు చేరినాను. నడిమివూళ్ళూ; నెంబరు 2 గర్ర 1 కవాసా 2 రెల్లి 3 రంని 4 కురాయీ5/

దారి నిన్నటి దారివలెనే బహు అనుకూలముగా నున్నది. దట్టమయిన అడివి మధ్య భాట. 6 వాగులు గొప్పవిన్ని; చిన్నవిన్ని దాటవలెను. మధ్య గర్ర అనే యూరివద్ద సుందరమయిన తామరకొలను ఒకటి వున్నది. అక్కడక్కడ 50 బారల దూరముకదాచిత్తుగా నల్లరేగడ భూమి తగులుచువచ్చును. అదిన్ని గట్టిరేగడగాని, కాలుదిగిపడే అడుసు కాదు. కురాయి అనే ఊరిళో