పుట:Kasiyatracharitr020670mbp.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కాశీయాత్ర వచ్రిత్ర

లిన వనక ఈ సొఖ్యకరమయిన యెర్రగులక యిసక గల భూమిని ఒక కోసెడు దూరమయినా చూచినది లేదు. దట్టమయిన అడివి మధ్యే భాట. గొప్ప వాగులున్ను మరికొన్ని చిన్న వాగులున్ను దారిలో దాటవలసినది. దొంగలతళావు అనే ఊరు చేరగానే జాగాకు నిర్వ్యసనముగా దుకాణాలవారు తమ తమ యంగళ్ళకు చేరి నట్టుల్గా 40 అడుగుల నిడివిన్ని 14 అడుఇగుల వెడల్పున్ను గల కొట్టాయీలు కట్టి, పొయిలువేసి ప్రతిదినమున్ను గోడలు సమేతుగా గొమయముతో శుద్ధి చేసి, కొట్టాయీల ముందర గుర్ర్రాలున్నూ పశువులున్నూ కట్టడానికి మేకులుపెట్టి కొట్టి యున్నారు. ముసాఫరులు సమ్మతమయిన కొట్టాయిలో దిగవచ్చును. అయితే కావలసిన భోజనసామగ్రీలు కొట్టాయి ఖామందువద్ద పుచ్చుకోవలసినది. ఒకటిన్ని కొనకపోతే పేదలను కొట్టాయిలో నిలవనియ్యరు. ముసాఫరులకు కావలసిన సామగ్రీలు అహంపూర్వ మహంపూర్వ మని యిచ్చుచున్నారు. యీ కొండమార్గములో కృష్ణమొదలుగా స్థలమునకి శ్రమపడుచు వచ్చినవారికి ఈ విశాలము లయిన స్థలములు ఆయాచితముగా దొరకటములో నుండే ఆనందము చ్ఫెప్పితీరదు. అయితే యీ కొట్టాయీలు వీధికి యెదురుగా నిరుపక్కల వేసియుంచున్నవి. పరదా కట్టివేస్తే యింతకుమిక్కిలి అనుకూలమయిన స్థలములేదని తోచబడును. గుర్రాలకు పచ్చికసువు మోపులుగా తెఛ్ఛి ఉంచి ప్రార్ధించి తీసుమను చున్నారు. కృష్ణదాటినది మొదలు సెనగలు అతినయము గనుక గుర్రాలదాణాకు చింతలేదు.

ఈ నాగపూరు రాజ్యములో దక్షిణదేశమువలె, యర్రకందులు, నల్లనువ్వులున్ను దొరకవు. అందుకు ప్రతి తెల్లకఁదులు తెల్లనువ్వులున్నూ సమృద్ధిగా అమ్ముతారు. తిలతయిలము దొరకడము అరుదు. ఆముదము శుద్ధముగా దొరకదు. అవిశలని నువ్వులవంటి గింజలు పండుచున్నవి. వాటినూనె విప్పనూనెయున్ను దీపాలకు పోయుచున్నారు. సకల ధాన్యాలున్ను అమ్మడముగాక అన్నిటినిన్ని పిండిగా విసిరి అంగడిలో పెట్టి ప్రతియూరిలోనున్ను అమ్ముచున్నారు.