పుట:Kasiyatracharitr020670mbp.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తీర్ధ హీనముగా ఎన్నటికిన్ని కాతగ్గదిగా నుండలేదు. ఆతీర్ధము పాతాళలోక జనితమయిన దనిన్ని యేట్లా ఊర్ధ్వలోకానికి భాగీరధిన్ని ఉన్నచో తద్వత్తుగా పాతాళలోకానికి భోగవతి అనే తీర్ధమిది యని పురాణ నిశ్చితమైయున్నది. అంబరీష మహారాజు అతిధిరాకను నిరీక్షించనందున దుర్వాసుల శాపగ్రస్తుడయి యుండగా ఈతీర్ధము ఆశాపమును నివర్తింపచేసినది. అంబరీష మహారాజు ఇక్కడికి 4 కోసుల దూరములో నుండే నంది గ్రామములో రాజధాని కలగ చేసుకొని దొరతనము చేసినాడు. రుక్మాంగదుని రాజధాని యెంత విచారించినా ఉయిదివరకు తెలిసినది గాదు.

ఈ పర్వతము పేరు సింధురాజ పర్వతము. శ్రీరాములు తన దొరతనములొ బ్రాంహ్మణ శిశువూయొక్క మరణ హేతువుని కనిపెట్టే కొరకు వెతకగా శూద్రుడు తపస్సు చేయుచు నుండను గనుక వాని సంహరించిన వెనుక వాడు నమ్రతను పొంది ప్రార్ధనచేసి నందున వాని లింగాకృతి చేసి తాను సీతాలక్ష్మణ, హనుమత్సమేతుండై యిక్కడ వసింపు చున్నాడు. యిది యీస్థల మహాత్మ్య పురాణ బోధితముగా నున్నది. ఈ స్థలమందు 28 తేది రాత్రి వరకు ఉందినాను.


ఆఱవ ప్రకరణము

29 తేది ఉదయమున 6.4 ఘంటకు లేచి అక్కడికి 6 కోసుల దూరములో నుండే దొంగల తళావు అనే వూరు 1 ఘంటకు ప్రవేసించినాను. ఈదినమున్ను కొంచెము త్యాజ్యశేషము ఉండగా ప్రయాణ మయినందున చెన్నపట్టణము వదలిన యిన్ని దినములు వర్షాకాలములో ప్రయాణ మయి నడిచి నందుకు సెలవుగా నేటి దినమున అడవిమధ్యే ఒక ఘంటసేపు నంతతొద్ధారమయిన వర్షములో తడియడ మయినది. దారి బహుబాగా ఉన్నది. నిర్మల నది