పుట:Kasiyatracharitr020670mbp.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కాశీయాత్ర చరిత్ర

నికిచుట్టు కొన్ని తీర్ధవాసుల యిండ్లున్ను ఇతరల్పరిజనుల యిండ్లున్ను నాగపూరిరాజు నగరు వొకటిన్ని వున్నవి. యీ నగరు అతి విశాలముగా కట్టియున్నది. యిక్కడ బ్రంహ్మోత్సవము తిరుణామలెవత్తుగా కార్తీక శుద్ధ పున్నమకు జరిపింపుచున్నారు. లక్షజనులు చేరుచున్నారు. కొండమీద దేవాలయానికి 700 మెట్లు ఎక్కిపోవలసినది. దేవాలయము చిన్నదయినా సుందరముగాను, పరిష్కారముగానున్ను కట్టియున్నది. కొండమీద నరశింహమూర్తి కిన్ని వరాహమూర్తి స్వామికిన్ని రెండాలయాలు కట్టి మూర్తులను స్థాపించినారు. ఆ రెండు మూర్తులున్ను అతిగాత్రములుగా, హధాశాస్త్రముగా జీవకళ తనకు దానేకలిగి యుండేటట్టు చేసియున్నవి. దేవాలయములో సకల రాజోపచారములతో నాగపూరిరాజు సం|| 1 కి 400 రూపాయిల ఖర్చుతో పూజలు బ్రాంహ్మణులకుండా నడిపింపుచున్నాడు. కొండమీదనుంచి చూస్తే ఆయూరి విస్తారము చక్కగా తెలియుచున్నది. యీగుళ్ళన్నీ కాశీ దక్షిణద్వారమని ఒక వాకిలి ఉత్తరపు పక్కనున్నది. తీర్ధమునుంచి కొండ నెక్కడానికి మెట్లుకట్టి యుండడముమాత్రమేకాక ఊరిలోనుంచి కొండ యెక్కడానకు వేరే మెట్లు సుందరముగా కట్టియున్నవి. రాజునగరులో దిగి క్షౌరము తీర్ధశ్రాద్ధము మొదలయిన క్రియలు చేసినాను. ఇక్కడి తీర్ధవాసులు మధ్యదేశజనులయినా ఆచార వ్యహార భాషలు దాక్షిణాత్యులతో భేదించియున్నవి. అరువై బ్రాంహ్మణుల యిండ్లు ఇంత యూరికి ఉండియున్నవి. తీర్ధమునము చుట్టున్ను మంటపాలు, ఫల వృక్షాలున్ను విస్తారముగా నుండుట చేతను చుట్టూ కొండ అవరించుకొని యుండుట చేతనున్ను బహు తపస్విజన వాసయోగ్యముగా నున్నది. కొందరు ప్;ఉనశ్చరణ తీర్ధతీరమందు దత్తత్రేయల వారి ప్రతిమ యొకటి మహా సుందరముగా చేసి ప్రతిష్ట చేయబడియున్నది. తీర్ధమధ్యే అంబరీష మహారాజు సువర్ణ మయముగా గుడికట్టి నాడనిన్ని అది కదాచిత్తుగా ఉదకము లోపమయిన కాలాలలో అగుపడుచున్న దనిన్ని తీర్ధ వాసులు చెప్పుతారు. ఆ కొలను