పుట:Kasiyatracharitr020670mbp.pdf/134

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


తారని యీ రేవువారున్ను సందేహముతో హాజరులేక తుదను ఒక యొంటికొయ్య దోనెను 2 ఘంటలకుపట్టి దానిగుండా 1 ఘంటసేపులో మూడు సవారీలనున్ను దాటించుకొని యివతల సాగివచ్చినాను. దారిలో వర్షముచేత రామటెంకిముందర కొంచముగా తడిసి నాము, సామానుకావిళ్ళు పోయినదోవ తెలియక కొంతసేపు వ్యధపడితిమె.

కామిటినుంచి రామటెంకీకి మూడు దోవలు వున్నవి. కామిటేశ్వర ఘట్టమువద్ద ఒక చిన్న శివాలయము వున్నది. అక్కడ ఖనానా అనే నదిని దాటి వచ్చేదారి రాజమార్గము. నాసామాను కావళ్ళూ మరియొక రేవున దాటి వేరేమార్గముగా పోయి కేడి అనే ఊరి వద్ద కలుసుకొన్నై. మరికొందరు పరిజనులు రామటెంకి యూరిముందర కలుసుకొన్నారు. దారి నల్లరేగడ. అడివి లేదు. మామిడిచెట్లశాల వేసియున్నది. కొన్ని వాగులు దాటవలెను. చిన్న యూళ్లు కొన్ని దారిలో నున్నవి. వాటివేళ్ళు యీ అడుగున వ్రాసినాను.

నెంబరు 1- బరోడా 1 - అగోరి 2 - కేడి 3 - సాటక్కుర హూరా 4 - రామటెంకి 5.

ఈ రామటెంకి రామక్షేత్రము; షహరువంటి యూరు. కొండచుట్టుకొనియున్నది. నాల్గువేలయిండ్లు కలవు. నాలుగయిదు చెరువులున్నవి. బహుజలవసరి. తమలపాకుల తోటలు అనేకముగా మజుబూతి అయిన పందిళ్ళు పెట్టివేస్తారు. యిక్కడ తమలపాకులు బహు ప్రసిద్ధిపొందినవి. దక్షిణమున హయిదరాబాదు వరకు, ఉత్తరమున ప్రయాగవరకున్ను పోవుచున్నవి. రాజాధిరాజులు టప్పవుంచి యీ తమలపాకులు తెప్పించు కొనుచున్నారు. నెలదినములవరకు కాపాడుచు వస్తే ఆకులు చెడిపొకుండా వుంచున్నవి. యీ ఆకుల గుణ మేమంటే పండినవెనక చెన్నపట్టణపు రవేసాకులంత సన్నములుగా మృదుత్వముకలిగి వుంచున్నవి; రుచిగాను న్నుంచున్నవి. ఈయూరిలో సకలపదార్ధాలున్ను దొరుకును. ఈయూరికి అర కోసెడు దూరములో కొండలమధ్యే అంబరీషతీర్ధ మనే కోలను దివ్యోదకముకలిగి చుట్టు అనేక మంటపాలతోకూడా వున్నది. తీర్ధా