పుట:Kasiyatracharitr020670mbp.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హయిదరాబాదు వద్ద ఒక మనిషిని బహుదుష్ట సర్పము కరిచి నంతలో పాముచెక్క నూరి యిచ్చి యేడులూనున్ను తాగించినాను. 3 ఝాములకు మనిషి లేచి తన యింటికి నడిచిపోయినాడు. చలిజ్వరాలకు లింగకట్టు బ్యార్కు ఇచ్చుచు వచ్చుచున్నాను. కొంత అభిముఖమయిన వెనుక భేదికి యిచ్చుచున్నాను. శ్రీరామ కటాక్షముఛేత గుణ మవుచు వచ్చినది. కూడావచ్చేవారికి నేను యిచ్చే ఔషధాలు గుణముఖానికి తెచ్చేటందున దిగేయూరిలో నొప్పిగలవారు కునుపడితే మాయజమానునివద్ద మంచి మదులున్నవనిన్ని ధర్మానికి యిచ్చుననిన్ని రహస్యముగా నా మనుష్యులు చెప్పుచు వచ్చినారు. వారు వారు వచ్చినన్ను శ్రమపెట్టసాగిరి. తెలిసి తెలియని చికిత్స చేయడమువల్ల బహుపాతక మని చెప్పి ఉన్నది గనుక, హయిదరాబాదు మొదలుగా నాపరివారము వినాగా ఇతరులకు ఆపదలేని విషయములో మందులు ఇవ్వడము లేదని నిశ్చయము చేసి ఆప్రకారము జరిపింపుచు వచ్చుచున్నాను.

దక్షిణదేశములో తిరుపతి తిరుణామలె యాత్రచేసిన వారిని అనేకులను చూడడము ఎట్లా సహజమో ఆరీతిగా ఈ నాగపూరు రాజ్యములో కాశీయాత్రచేసి దారి ఖుల్లనుకూడా చెప్పగల వారిని అనేకులను చూడవచ్చును.

ఇటువంటి నాగపూరి షహరు ఆగష్టు 21 తేది వదిలి ఆ దిన మున 2 ఘంటలకు కామిటి అనే యింగిలీషు దండుండే స్థలము ప్రవేశించినాను. కామెటీశ్వర ఘట్టం రేవులోను అక్కడి ఖననానదిని దోనెల కుండా 23 తేది దాటి అక్కడికి 7 కోసుల దూరములోనుండే రామ టెంకి అనే గుహస్థలము పగలు 2 ఘంటలకు చేరినాను. నేను ఉదయాన కామిటి వదిలి బయలుదేరేటప్పుడు 3 ఘంటలు. అప్పుడు త్యాజ్యశేషమూ ఉండినది. దానిఫలమేమంటే నదరహీనది దాటడానికి నాలుగయిదు రేవులలోను న్నుండే పదవలకు కర్నల్ ప్యారన్ మొదలయిన దొరలు వారికింది యధికారస్థులకు తొలుదినమే ఉత్తర్వుచేసినందున కింది అధికారస్థు లందరు నాతో కూడా దోవ పంపించను నదిదాకా వచ్చిన్ని పడవవాండ్లు యీరేవున దాటుతారని ఆరేవువారున్ను ఆరేవున దాటు