పుట:Kasiyatracharitr020670mbp.pdf/131

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


నాకు జోసింపుచు వచ్చినారు. ఈషణ త్రయాలమీది యభిమానము నిరోధిస్తే అది సచ్చిదానందము కలుగచేయగల మాయద్వారా ఆశ్ఛర్యకరమయిన భయహేతువుగా మనసుకు తోచుచున్నందున అయోధ్య మొదలయిన మహాస్థలములకు స్వదేశములో నున్నప్పుడు అనుకొన్న ప్రకారము సయిపు చేసుకొని పోదామనే తాత్పర్యము ఇక్కడవదిలినది. కర్మద్వారాజ్ఞానము సంపాదించవలెననే అస్మదాదులకు నమ్మికచేత కడతేరవలసినది గనుక మిత్రబోధవత్తుగానుండే స్మృతి వాక్యముల ప్రకారము గంగాస్నానము, గయావ్రజనమున్ను చేసి స్వదేశానికి రావలెనని యున్నాను. స్వదేశ పక్షపాతము లోకులకు ఈచొప్పున కలగడానికి ముఖ్యకారణ మేమని విచారించగా ధరించి యుండే దేహము మీద యభిమానము కలవారు బాల్యాదారభ్యతమతో సహవాసపడిన వారు బహుమంది స్వదేశములో నుండుట చేతనున్ను, మనసుకు దేహము నావవంటిది గనుకనున్ను మనసనే నావ తిప్పేవాడు జాగరూకుడు గాకపోతే యేలాగు వాడస్వేచ్చగా కొంతకాలము సంచరించగా ఆబాడవాడు వాడకు అధీనమైపోవునో అలాగే యీదేహము మనసు అధీనమయి నా దేహసౌఖ్యము తనదనే భ్రాంతిని పొంది యుండుటవల్ల మనసు దేహాధీనమయి స్వదేశగమనమును నిరీక్షింపుచున్నది.

ఇటువంటి నాగపూరు పట్టణములో ఒంటికంభం డబ్బల్ టాపు కావాతులు కల డేరా ఒకటిన్ని, వంట భోజనాలకు కంబళి దేరా ఒకటిన్ని సంపాదించు కొనుటకున్ను పల్లకి మరమ్మతు చేయించు కొవడమునకున్ను ఆగష్టు 14తేది మొదలు 20 తేది వరకు నిలిచి నాను. హయిదరాబాదు షహరువలెనే యీషహరులో నేను ప్రవేశించిన కాలమందు కృష్ణ నవరాత్రి యుత్సవము మధ్య దేశములో పసల పొంగలికి జరిగించే ఆగమమంతా పశువుల విషయముగా నున్ను మనుష్యుల విష్యముగానున్ను జరిపింపు చున్నారు. హయిదరాబాదులో నుంచి తెచ్చిన ప్రయివేటు టెంటును అనే శిఫాయి డేరాలను ఇక్కడ వదిలి, నూతనముగా సంపాదించిన డేరాలకు గాను