పుట:Kasiyatracharitr020670mbp.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నున్ను, ఒకరి యుక్తిమీద నొకరు తమ బుద్ధిద్వారా మొదటి వాని యుక్తిని కారణ మగురూప దేశముగా నుంచుకొని తాము యెక్కువ యుక్తిని కలగచేసి రాజ్య తంత్రము గడుపుదురు. పయిగా తల్లి దండ్రులుగల బిడ్డలు తల్లి కొపము చేస్తే తండ్రివద్దకిన్ని, తండ్రి కోపముచేస్తే తల్లి వద్దకిన్ని యెట్లా పోవుచు వచ్చుచు నుందురో హయిదరాబాదు యింగిలీసు దండులలో నుండేవారు ఒక ప్రభువును వదిలి మరియొక ప్రభువు వద్దికి పోవుచు, వచ్చుచు నెట్లా ఆనందింపుచున్నారో అలాగే ప్రజలు సుఖపడవచ్చునని తోచుచున్నది. యీ యుక్తి చేతనె యీశ్వరుడు (విభ్రాతి విశేషాలను భూరి దక్షిన పంఛినట్టు ఆయాకాలాలలో పాత్రమెరిగి పంచిపెట్టుచు వచ్చుచున్నాడు.

యీ నాగపూరు రాజ్యానకు చెన్నపట్టణపు దండు రాక మునుపు చింతపండు దేనికి ఉపయోగమయ్యేదిన్ని తెలియదు. ఈదేశస్థులు వేడిగా కాచకనే పచ్చి మజ్జిగెగాని పెరుగుగాని పోసుకొనరు. దక్షిణ దేశపు శూద్రులు రాత్రిలో మజ్జిగ పెరుగు పోసుకుంటే యెట్లా, జలుబు చేసునని భయపడుదురో అలాగే ఒక భయము వీరికి జనియించి యున్నది. ఆహార విశేషాలు జాఠరాగ్నికి స్నేహమయ్యేదాకా ఎటువంటిదిన్ని అనుకూలిందు; స్నేహమయిన వెనక బాధించదుగనుక మేమురాత్రిలో, పగటిలోనున్ను ఈ రాజ్యములొ విశేషముగా దొరుకుటచేత మజ్జగెగాని పెరుగుగాని తాగడమువల్ల మాకు ఏమిన్ని విరొధము చేసినది కాదు. యిందుకు దృష్టాంతము వనములో సంచరించే మనుష్యులు విషజంతువుల భీతి లేక నుండే కొరకు మనిషిని చంపదగిన గరళమును, ముష్టివిత్తులనున్ను తిని జీర్ణము చేసుకొనుచున్నారు. గనుక దేశాచారమునిబట్టి వాడికె యయిన ఆహారపదార్ధాలు విడవతగ్గవి కావని తోచుచున్నది. దేశాటనము చేయడములో పోష్యులుగా నుండే దారాపుత్రాదులను కూడా తీసికొని విషయాపేక్ష నివృత్తిపొందక వచ్చినా, తృణాగ్రముగాని భగవదాజ్ఞ లేక చలించ దనే సత్యవార్త పెద్దలకుండా వినపడినట్టు రాజఠీవిగా శ్రీరాములు ఇదివరకు దోవలో