పుట:Kasiyatracharitr020670mbp.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మొదలారని విహితపరచు కొన్నట్టే విహితము చేసుకొని అతని గుండా మోతీ బాగు అనే బహువసతి అయిన తోటలో బంగాళాలో దిగినాను.

ఈ నాగపూరు రాజ్యము పూర్వ పూర్వకముగా కొండరాజులది. వారి అడివిని బలము చేసుకొని కొండల దుర్గ ప్రదేశాలను ఆశ్రయించుకొని భాటసార్లు కూడా తమభూమిలో రాకుండా వుండేటట్టు ఘాతచేయుచు ద్విపాతృశువులుగా సకల విధాల నటించి ఈ రాజ్యము ననుభవించు వచ్చినారు. సుమారు 200 ఏండ్లకు మునుపు బుద్ధోజీ అనే అతని పెద్దలు షాహురాజు సుతులు గనుక *[1] పూనా శ్రీమంతునికి షాహురాజు రాజ్యమును దానము చేసి జ్ఞాతులను కొండరాజ్యముల సాధించుకొని శ్రీమంతుని ఆజ్ఞకింద నుండు డని నియమించినారు. ఈ నాగపూరు సమీపర్తి అయిన భూమిని బుద్ధోజీయొక్క పెద్దలు సాధించినారు. తదనంతరము క్షాత్రధర్మము చొప్పున క్రమక్రమముగా ఈ కొండరాజులను పూర్తిగా సాధించి యీ నాగపూరును రాజధానిగా చేసుకొని రాజ్యము చేయుచు వచ్చినారు. షాహురాజు యొక్క మరియొక తెగ జ్ఞాతులు దక్షిణ రాజ్యములో ప్రవేశించి తంజావూరి సీమసాధించి దొరతనము చేయుచు వచ్చినారు. ఆషాహురాజవంశము భోసల వంశమని చెప్పబడు చున్నది. సాతారా అనె షహరు షాహురాజుకు రాజధాని. ఆ షాహురాజును డిల్లీ పాదుషా కూతురు మోహించి వివాహము చేసుకోవలె నని యుండగా ఫాదుషా షాహురాజును చంపినాడు. అతని కొడుకు చిన్న షాహురాజును ఫాదుషా కూతురు పెంచి యీ సాతారాకు రాజుగా చేసెను. వనక రాజ్యము చేయుచున్న అతని వంశస్థులకు పుత్రసంతతి లేనందున ఆశ్రయించి యున్న భ్ర్రాంహ్మణునికి రాజ్యమును దత్తము చేసినాదు. జ్ఞాతులను, కొండ రాజ్యములను పయిన వ్రాసిన ప్రకారము సాధించుకొని తాను రాజ్యదాన మిచ్చిన బ్రాంహ్మణునియొక్క ఆజ్ఞకులోబడి నడుచుకొనుడని ఉత్తరువు చేసినాడు. ఆబ్ర్రాంహ్మడే శ్రీమంతుడు.

  1. * ఈ పునా శ్రీమంతుడు పీష్వా అని చరిత్రలో ప్రసిద్ది వహించిన మహారాష్ట్ర నాయకుడు. శ్రీ శివాజీ తరువాత మహారాష్ట్రరాజు ఆయన మనమడగు షాహు పేరుకు రాజు. ప్రధానమంత్రి బ్ర్రాహ్మణు డగు పీష్వాయే నిజమగురాజు.