పుట:Kasiyatracharitr020670mbp.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇట్టి నియమములంతా స్వతంత్ర ప్రవృత్తి నివృత్తులను కలవి గనుక ఈ ఆచారము ప్రమాదమైనది కాదు. అయినా ఆ స్థలము యుక్తముగా తోచనందుననున్ను, బ్ర్రాంహ్మణ యిండ్లలో జాగా కునందిగనుకనున్ను మరిన్ని వారి యాచారవ్యవహారాలలొ శూద్రులగుండా ఉదకము తెప్పించుకొని వాడుకొనేటట్టుగాకూడా ఉన్నది గనుక నున్ను వాగువొడ్డున డేరాలు వేసి దిగి ఆ యూరిలో ఆ రాత్రి వసించినాను. దారిలో దాకిలి ఘాటుదాకా కొన్ని యూళ్ళున్నవి. మజిలీ చేయడానికి యోగ్యములు కావు. హయిదరాబాదు మొదలుగా మంచి యిండ్లు కట్టుకొనేవారు మట్టిమిద్దె నొక అర యింటికిగాని, కూటానికిగాని వేసి పైన పెంకుల పూరితో నొక కట్టడి యేర్పరచి పైన నెక్కడానకు, ఒక నిచ్చెనగాని, పొడుఘుమెట్లుగాని కట్టి పెట్టుచున్నారు. సాధారణముగా ఇండ్లు కట్టే వారు పెంకులతోను, పూరితోను కట్టుచున్నారు. యెదులాబాదువరకు నుండే పెంకులు దక్షిణదేశములో నీళ్ళకాలువలకు పెట్టే కోవుల మాదిరిగా నుంచున్నది. ఆయూరికి ఇవతలి పెంకులు దక్షిణదేశములో మిద్దెలకు వేసే చదరపు పెంకుల జాడగా నడమ కొంచమువంపు కలిగి యున్నవి.

ఐదవ ప్రకరణము

14 తేది ఉందయాన 7 ఘంటలకు ఈ యూరు వదిలి యిక్కడికి 4 కోసుల దూరములో నుండే నాగపూరు షహరు 10 ఘంటలకు ప్రవేశించినాను. దారి ఘట్టి నల్ల రేగడభూమి; అడివి కలదు. రాతిగొట్టులేదు. బాట కిరుపక్కల కనుచూపుమేరకు చదరముగా నుంచున్నది. నాగపూరు ముందర నగలేరు అనె పెద్దవాగు దాటవలెను. నాగపూరు షహరువద్ద శీతాబులిడి అనే ప్రదేశ మున్నది. అక్కడ రెసైడెంటు ఇల్లు, తోటలు కలుగ జేసుకొని యుంచున్నాడు. చుట్టున్ను కొన్ని ఇండ్లు అంగళ్లు తోటలు న్నవి. చెన్నపట్టణపు కాపురస్తుడయిన వీరాసామిమొదలారి పోష్టాఫీసు రయిటరుగా ఇక్కడ నున్నాడు. గనుక నితో హయిదరాబాదులొ కమ్మిస్సెరియాట్ మ్యానేజరు రామస్వామి