పుట:Kasiyatracharitr020670mbp.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

12 ఏనుగుల వీరాస్వామయ్యగారి కాశీయాత్ర చరిత్ర

ప్రకరణము పుటలు

4.కృష్ణా గోదావరుల మధ్య రాజకీయ సాంఘిక స్థితి-ఆచారవ్యవహారాలు-అరవము; తెలుగు-పంచాంగము- వైదికులు - డాగావాండ్లు - నిర్మల - నిజాముకింద యింగ్లీషు కలకటర్లు- తెనుగుభాష -దృష్టిదోషము. 45-60

5.నాగపూరురాజ్యం పూర్వచరిత్ర - రఘోజీ; అస్పాసాహెబు - ఇంగ్లీషువారి రాజ్యతంత్రము - కామిటిఅనే ఇంగ్లీషు దండుప్రడేశం - పరిపాలన - స్త్రీ పురుషులు - దేశాచార వ్యహారములలో ధర్మశాస్త్రములో తేడాలు - కామిటి వర్ణన - బింబారాధన - హిందువులు, క్రైస్తవులు - స్వదేశ పక్షపాతము - రామటెంకి క్షేత్రము. 60-76

6.దొంగల తళావు - నాగపూరిరాజ్యము - బంగాళా గవర్నమెంటు - జపల్పూరులో కుంపినీ పరిపాలన - అవతారాలు; త్రిమూర్తులు, క్రీస్తు; మహమ్మదు; పరబ్రహ్మ - బోయజాతి - తీజవారా - నర్మదానదిలో తాళ్ళన్నీ లింగాలే - రేవుపడవలు - కుంపినీవారి హాశ్శీలు - ఆంధ్ర భ్రాహ్మణులు - చిత్పానములు - వింధ్యపర్వతము - ఇంగ్లీషు దొరతనము - న్యాయవిచారణ. 76-90

7.జబల్ పూరు - దేశచరిత్ర - సాగరారాజు - ఇంగ్లీషు దొరతనము - ఆచారనియమాలు - శూద్రదృష్టి, స్త్రీలు - దాక్షిణాత్యులకు ఉత్తర దేశస్తులకు ఆహారములో ధైర్య స్థైర్యాలలో బింబారాధనలలో తేడా - నెల్లూరికి ఉత్తర దక్షిణములలోతేడా. 91-107


8. బొందిలి ఖండము - మైసూరు - రీమా - ఆగామిసంచిత ప్రారబ్ధకర్మాలు; విధి; ఈశ్వర కటాక్షములను గూర్చిన చర్చ. 107-116

9. హనుమాన్యా - డ్రమ్మన్ గంజా - ఇంగ్లీషువారు - దొంగలభయము - మిరిజాపూరు - గంగానది - కుంపిణీవారి రాజ్యంలో ఆయుధాలు పట్టనియ్యరు - తమలపాకులు - వింధ్యవాసిని - గొపీగంజు - భాగవత కాలక్షేపము - పోలీసు. 116-128

10.ప్రయాగ - అక్షయ్వటము - త్రివేణిసంగమము- క్షేత్రమహత్మ్యము - అక్బరుపాదుషా - వేణీదానము - బంగాళాగవర్నమెంటు ఫినాన్సుకమిటీ - నదులుగుళ్ళు ఈశ్వడేనా? - మూర్జరులు-పంచగౌడస్త్రీలు - దక్షిణంలో పస్త్రాల శుభ్రత; ఉత్తరాన్ని పాత్రసామానుల శుభ్రత- పంచగౌడులు, ద్రావిళ్ళు, వారి ఆచారవ్యహారాలు - జ్ఞానయోగము.128-140

11.హిందూస్థానీమాటలు - వర్ణాశ్రమధర్మములు - గౌడసన్యాసులు - గోసాయిలు -అద్వైతము - హిందూమతశాఖలు - క్రీస్తు మతస్థులు బౌద్దమతము - స్త్రీలు మోక్షార్హతా? హృత్కమలములు - ఖజరాలు - గంగానదిమీర ప్రయాణము - ప్రయాగ కాశీల సంకల్పములు.144-188