పుట:Kasiyatracharitr020670mbp.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వొడ్డూరు బస్తీ గ్రామము. సకల పదార్ధములు దొరుకును. భ్రాంహ్మణుల యిండ్లు చావిళ్ళున్నున్నవి. ఇక్కడ నొక చావిడిలో ఈ రాత్రి నిలిచినాను.

3 తేద ఉదయాన 6 ఘంటలకు బయలు వెళ్ళి 7 కోసుల దూరములో నుండే విచ్చోడా అనే యూరు 1.2 ఘంటలకు చేరినాను దారి నిన్నటివలెనే సకల్ విధములయిన ప్రయాసలను ఇచ్చుచున్నది. కొండ యొక్కుడు దిగుడు గలది. రాతి గొట్టు మాత్రములేదు. దారిలో కడం అనే నది దాటవలెను. ఈ నది వెడల్పు తక్కువ అయినను బహు ఘాత చేసేది. పడవ, తెప్ప, మొదలైనవి కూడా ప్రవాహవేగములో నడవవు. ప్రవాహ కాలములో కుంఫీణీ టప్పాకూడా రెండు మూడుదినములు ఇక్కడ నిలిచిపొవు చున్నది. విచ్చోడా అనే యూరు బహుచిన్నది. యధోచితముగా కావలసిన పదార్ధాలు ముసాఫరులకు దొరుకును. ఇక్కడ డేరాలలో వసించినాను. వోడ్డూరు - విచ్చోడా మధ్యే కొన్ని చిన్న గ్రామాలున్నవి. నిలవయోగ్యములు కావు. దారికి యిరుపక్కలా చిన్న పర్వతములు దర్శన మవును. మిట్టలో నించి పల్లానికి నిండా దిగే కడం నది దగ్గిర నెక్కవలసి యున్నది. ఆయూరున ఆరాత్రి ఉన్నాను.

4 తేది 6 ఘంటలకు బయలుదేరి 2 ఘంటలకు 10 కోసుల దూరములో నుండే యేదులాబాదు అనే షహరువంటి యూరు చేరినాను. దారి అట్నూరు అనే యూరివరకు నల్లరేగడభూమి. అడుసు లోగడి రెండు దినముల వలెనే దిగపడుచున్నది. ప్రయాస చెప్పి తీరదు. ఆట్నూరు మొదలు యేదులాబాదు వరకు దారి నడవడానికి గులక యిసుక పరయున్నుచిన్న రాళ్ళగోట్టున్ను గనుక అనుకూలముగా నున్నది. అయితే మేకల గండి అనే ప్రసిద్ద మైన ఘాటు ఇక్కడ దాటవలసినది. ఈ ఘాటులోని యడివి, బల్లెము దూరని పాటి దట్టమని చెప్పవచ్చును. వ్యాఘ్రభయము విస్తారము. పులియడుగులు దారిలో చూచుచు మేము నడిచినాము. బహు జాగ్రత్తగా బాటసార్లు ఇక్కడ నడుచు చున్నారు. ఒకరిని ఒకరు విడిచే ప్రదేశము కాదు. తుపాకులు అక్కడ కాల్చుచు