పుట:Kasiyatracharitr020670mbp.pdf/109

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యీదలవాయిలో తమలపాకులు బహునయము. బాలకొడలో పండటాకులు దొరుకును. కడప మొదలుగా యీ గోదావరీ తీరమువరకు అమ్మే వక్కలు ముడి వక్కలు రెండుగా వొత్తి ఉడక బెట్టినవి కావు; మంచిదిగా ఏర్పరచివొత్తివేసుకొంటే మనదేశపు వక్కలకన్నా బాగా రుచిగా ఉంచున్నవి. యీదేశములో పేదలు నిండా తాంబూలము వేసుకోవడము లేదు; ఒక్కలు మాత్రము నవులుతారు. శూద్రుల చేతి హుక్కాలు ఇతరులు తాగుచున్నారు.

కృష్ణదాటినది మొదలుగానున్న ముఖ్యముగా హయిదరాబాదు మొదలుగానున్ను, ప్రతిమజిలీ యూళ్ళలో బియ్యముతోటి పాటు తియ్యగానుండే గోధుములపిండి విసిరి అమ్ముచు వచ్చుచున్నారు. యీదేశములో రొట్టె వినాగా అన్నమే భుయింపుచు వస్తే దేహానికి బలము లేదని వదైంతి గనుక, మే మొకపూట రాత్రి అన్నముతో కూడా రొట్టె తీసుకొనుచు వచ్చుచున్నాము. అది ఆరొగ్యము గానే యున్నది.

పై జగనంపల్లె నుంచి కుళదర్పణ మనే గోదావరీ తీరపు రామక్షేత్రానికి దారి పోవుచున్నది. ఆక్షేత్రము ఇమ్మడికి 4 కోసుల దూరము. నాగపూరి దారికి వొత్తియుంచున్నది. అక్కడ అనేక బ్రాంహ్మణులు తీరవాసమని యిండ్లు కట్టుకొని యున్నారు. ఈదూదుగాము నదికి గడియదూరములోనున్నది. యిక్కడ స్నానఘట్టము వసతికాదు; నీడలేదు. నది యిప్పట్లో పూర్ణ ప్రవాహముగా నున్నది. ఇక్క్డసుమారు నది గడియదూరము వెడల్పుకలది. నది నడమ కొన్ని లంక లున్నవి.

కడప వదిలినది మొదలుగా అరవభాష తెలిసి మాట్లాడ తగినవారు సకృత్తుగానున్నారు. తెనుగుమాటలు సర్వసాధారణముగా రాగసరిళిగా చెప్పుచున్నారు. ప్రశ్నపూర్వకముగా ఉత్తర ప్రత్యుత్తర మెచ్చేటప్పుడు శబ్దములను సంకుచిత పరచి మాట్లాడుచున్నారు. ఎట్లాగంటే యీ యూరు ఆయూరికి ఎంతదూరమంటే నాకు యేమి యెరుక యని ప్రత్యుత్తరము పుట్టుచున్నది. పండుకొన్నాడు అనడానకు పండినాడని అనుచున్నారు. హిందూస్తాని తురకమాటలు తరుచుగా దేశ