పుట:Kasiyatracharitr020670mbp.pdf/107

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ఏనుగుల వీరాస్వామయ్య గారి

మొదలుగా పాలు, పెరుగు మాత్రము తంబళజాతి వారిగుండా ఊరూరిలో సమృద్దిగా దొరకును. కూరగాయలు మాత్రము ఈబాలకొండలో కండ్ల చూడవలసినదిగాని మధ్యదొరకవు. ఈయూరికి 3 కోసుల దూరములో రామనపేట అనే యూరున్నది. అక్కడ మేనాసవారీలు గంజీఫాచీట్లు ఇవి మొదలయినవి చేసి హయిదరాబాదుకు తీసుకొనిపోయి అమ్ముచున్నారు. యీ యూరిలో జీనిగెలవాండ్లు అనేకులు ఉపపన్నులుగా నున్నారు.

ఈదేశములో కంబళ జాతివారు పుష్పాలు, పాలు, పెరుగు తెచ్చి యిచ్చి మేళాలు వాయింపుచున్నారు. మంగలజారివారు మషాల్ వేయుచున్నారు. బాలకొండకు ఇవతల కొసెడు దూరములో మూకలా అనెచిన్నగ్రామము; అదిదాటి యీదూదుగాముకు రావసినది. యిదినిండా బస్తీ అయినది కాదు. ఆర్మూరు పరగణాతో చేరినది. పట్టేలు గుమాస్తా ఉన్నాడు. నది దాటీంచే పుట్ల విచారణకర్త వాసముగా నున్నాడు. ఈయూరికి అవతలు తట్టున నుండే యూరు మాధ్వుల మయము. వారే తీర్థవాసులు. స్మాత్రులు నది యిండ్లవారు ఈ రెండూళ్ళలో నున్నారు. కావలసిన పదార్ధాలు యధోచితముగా దొరుకును. యీ దూదుగాముకు ఉభయపార్శవాలలో షహరులవంటి గ్రామాలు రెండున్నది. ఒక పక్క బాలకొండ సరేగదా' గోదావరి నదికి అటుపక్క నిర్మల అనే షహ రొకటి యన్నది. ఈ రెండు స్థలములలో పట్టణములలో దొరికేలాగు సకల వస్తువులు దొరుకును. యీదలవాయి మొదలుగా దూదుగాము వరకు భాట యోగ్యముగా నున్నది. అడుసువల్ల, రాతిగొట్టువల్ల ప్రయాస నిండాలేదు. ఈగోదావరి తీరమందు తీర్ధవిధులు మొదలయినవి చేయడానికు 4 దినములు ఉంటిని. హయిదరాబాదులో నున్న మట్టుకు అన్ని, దినములు అక్కడ వృధాగా నిలవవలసి వచ్చెగదా అనేవ్యసనము చాలావుండెను. ఇప్పుడుతర్వ్యతిక్తముగా మనస్సుకు బోధ అయినది. ఏలాగంటే అక్కడ నేను నిలిచియున్న సుమారు 20 దినములున్ను ఈప్రాంతములలో క్షోణీపాత మయిన నష్టము, ఇరిగింటి మనిషి పొరిగింటికి పోకూడ