పుట:Kasiyatracharitr020670mbp.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రదేశములకు తుపాకులు బహుజరూరు గనుక కడపలో రెండు తుపాకులు తీసుకొన్నాను. హాయిదరాబాదులో కొల్వు పెట్టిన వారిలో అయిదుగురు తుపాకులు తెచ్చేటట్టు నిశ్చయము చేసినాను. ఆ గండిలో నడిచే టప్పుడు అక్కడక్కడ తుపాకీలు కాల్చుచు రావడ మయినది. మల్లుపేట మొదలుగా యీదలఘాటు చేరేపర్యంతము భాట నల్ల రేగడ భూమి; వెనుక భాట రాతిగొట్టు. ఆయీదలవాయి యూరిలో చీలి జమీనుదారుని తరఫున పట్టేలు అనే అధికారస్థుడున్నాడు. దేవాలయ విచారణను అతడే చేయు చున్నాడు. ఆయూరిలో 23 తేదీ రాత్రి పర్యంతము నిలవడమైనది.

27 తేదీ ఉదయమున 3 ఘంటలకు యీదలవాయి వదిలి అక్కడికి 2 కోసుల దూరములోనుండే జగనంపల్లె అనే గ్రామము 12 ఘంటలకు ప్రవేశించినాను. యీదలవాయి దాటినది మొదలు కొని కోసెడు దూరములో నుండే డిచ్చుపల్లె అనే మజిలీ గ్రామము చేరేవరకు ఒక చిన్నఘాటునడుమ మార్గము పోవుచునది. అయినా మొందర వదలివచ్చిన ఘాటంత భయము కలది కాదు. భాట సమభూమి. గులక యిసకపొర. కొంచెము రాతిగొట్టు; ఇరుపక్కల మోదుగ చెట్లు వగైరాల యడినవి. ఈ డిచ్చుపల్లెలో యీదలవాయిలో నుండే రామమూర్తిని ప్రతిష్టచేసే నిమిత్తమై పూర్వమందు గొప్పదేవాలయము కట్టినారు. అయితే వాసానికె యోగ్యముగాదని తోచి పరమాత్ముడు కొన్ని లోకదృష్టాంతముల చేత తెలియచేసి యీదలవాల్యిలో యిప్పుడు ఆరాధనలు గైకొనే మూర్తులను స్తాపింపచేసినాడు. ఇప్పటికిన్ని డిచ్చుపల్లెలో కట్టిన దేవాలయము పాడుగాఉన్నది. ఈడిచ్చుపల్లె మొదలు జగనంపల్లె కోసెడు దూరము కలదనే వరకు భాట సరాళము, గులక యిసకపర, నిండా అడివి లేదు; అవతలి కోసెడుదూరమున్ను ఘాటునడుమ పోవుచున్నది. భాట కిరుపక్కల దట్టమయిన యడివి. కొండలసందున భాట. ఈఘాటు నిండా భయాస్పద మయినది కాదు. ఇక్కడ మొగలాయి `రాణావారు కొందరు తుపాకులతో కూడా ఉంచున్నారు. వారు వచ్చేవారిచేత