పుట:Kasiyatracharitr020670mbp.pdf/101

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


నొకటి రెండు వాగులు దాటవలసి యున్నవి. అవి వర్షాకాలమున ప్రవాహము వస్తే దాటుటకు నొకటి రెండు దినములు కావలసియున్నది. ఊరు పెద్దది; కావలసిన వస్తువులు దొరుకును; అంగళ్ళు చాలా యున్నవి.

నేను చెన్నపట్టణము నుంచి వచ్చేటప్పుడు కొలువుగా పెట్టుకొని తెచ్చిన 6 మంది బంట్రౌతులు గాక కడపలో 4 మరాటి బంట్రౌతులను కొలువులో పెట్టినాను. హయిదరాబాదులో నెక్కువగా 4 మందిని కొలువు పెట్టినాను. వీరికంతా జనము 1 కి నెల 1 కి రూ.7 లెక్కను జీతముచేసి నేను చేసిన ఖాయిదా యేమంటే కాపాడవలసిన మూల పదార్ధము సహజముగా యజమానివద్ద నుండే పెట్టెలలో నుండు ననే తాత్పర్యము లోకులకు ఉండవలసినదే గనుక అటువండి తాత్పర్యముతొ అయోగ్యులు ప్రమాదమును చేతురని తలచి నామూల ధనము క్షేమముగా నుండుట కొరకు మూలధనపు పెట్టెలను సవారీలలో ఉంచి సవారీ తలుపులకు బిగాలు వేసి సవారీలను ఊళ్ళలో దూర ప్రదేశపు చావిళ్ళలోనున్ను, ముసాఫరు ఖానాలలో నున్ను, మశీదులలో నున్ను ఉంచి యిద్దరేసి బంట్రౌతులను జాముకు ఒక జతగా పారాయిచ్చే బట్టు 6 మందిని నిశ్చయించి బోయీలను జాగ్రత్తగా కూడా ఉండేలాగు దిట్టము చేయుచూ వచ్చినాను. సామాను కావడి పెట్టెలను నేను దిగేస్తలములో ఉంచి అక్కడ జాముకు ఒకడు వంతున పారాఉండే లాగు ముగ్గురు బంట్రౌతులను ఉంచుచు వచ్చినాను. హయిదరాబాదులో పాల్ లు అనే శిఫాయి డేరాలు నాలుగు తీసినందున అవి మోయను 4 యెద్దులున్ను ఆడేరాలలో చెమ్మగిలకుండా వేసే కీలు చాపలు మోయను ఒకయెద్దున్ను, ఆడేరాల మేకులు 200 మోయను ఒక ఎద్దున్ను, అంతు ఆరు యెద్దులున్ను ఎద్దు 1 కి నెలకు రూ.8 లెక్కకొలువు పెట్టి తీసుకొని వచ్చినాను. 3 యెద్దులకు నొక మనిషి వంతున ఇద్దరు యెద్దుల వాండ్లు కూడా వచ్చినారు. ఆడేరాలు కట్టనున్ను, తియ్యనున్ను ఇద్దరు కళాసులను నెలకు 1 కి మనిషి 1 కి రూ.లెక్కను సంబళానికి కొలువు పెట్టుకొన్నాను. ఆ డేరా బొంగులు ఎద్దులు