పుట:Kasi Yatra Chellapilla Venkatasastry.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పాకులు వేసికొనుట ఒకటి. అది మిక్కిలి పల్లెటూరగు కడియెద్దలో దుర్లభమయినది." కాశీలో సత్రాల్లో భోజనము పెట్టుటయేకాక ప్రతిరోజున్నూతాంబూలముకూడా విధిగా యిస్తారని వినియుండుటచే కాశీ వెడదామని బలవత్తరమైన కోరిక వుదయించింది. అయితే అది ద్రవ్య సాధ్యమవుటచే, వెంటనే సాగలేదు. ద్రవ్యము లేకుండా బయలుదేరితే యేమవుతుందో యింతకు ముందొక పర్యాయము వేటౌకని ప్రేరేపణ మీద బయలుదేరి విశాఖపట్నము వఱకును వెళ్లి పయిని వెళ్లలేక తిరిగివచ్చిన నాకు పూర్తిగా తెలిసేవుంది గనుక, తొందరపడి బయలుదేరలేదు. ఈ లోపున శాస్తులవారు ఆయీ విద్యార్థులనెల్ల పోషించడానికి అప్పుడప్పుడు కొన్ని గ్రామాలు సంచారం చేస్తూ వుండడములో, అక్కడక్కడ కొందఱు సంపన్నగృహసులు మా గురువుగారిని “మీ విద్యారులలో నెవరైనా పురాణం చెప్పేవారున్నారా" అని అడుగుచుండేవారు. వారికి మా గురువుగారు నన్ను చూపేవారు. నా వలన ఆ గృహస్టులు పురాణం విని, నాకు పదో, అయిదో రూపాయలిచ్చి పంపుచుండేవారు. ఆ ద్రవ్యాన్ని నేను మా గురువుగారి వద్దనే దాచుకొనే వాడను. ఏలాగైతేనేమి ఆయీ బాపతు సొమ్మ నా తాలూకు మా గురువుగారి వద్ద సుమారు యాభై రూపాయల వఱకున్నూ నిలువ వుంది. ఈ సొమ్ముతో నేను కాశీకి వెళ్లవచ్చునను ధైర్యము కలిగింది. అప్పటికి రైలు బెజవాడ వఱకు వచ్చింది. బెజవాడనుండి కాశీకి సుమారు పద్దెన్మిది రూపాయీలు రైలు చార్జీ, అయితే యీ సొమ్ము గురువుగారి నేమనియడుగుదును? కాశీ వెళ్లేదనని వారితో చెప్పవీలులేదు గదా, ఏదో వంక పెట్టి పుచ్చు